భయం వద్దు.. అదే మనకు శ్రీరామ రక్ష.. కరోనాపై ఈటెల కీలక వ్యాఖ్యలు..?

praveen
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రస్తుతం శరవేగంగా పాకి పోతుంది.  గత ఏడాది ఇదే సమయంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా ఉంది ప్రస్తుతం అదే పరిస్థితులు వస్తున్నట్లు తెలుస్తోంది.  మొన్నటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  వైరస్  విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో కాస్త కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ఇక అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనే చెప్పాలి.  కరోనా వైరస్ కేసులు తగ్గాయని వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని ప్రజలందరూ కాస్త సంతోష పడుతున్న సమయంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తోంది.



 దీంతో దేశ ప్రజానీకం మొత్తం మళ్లీ ఆందోళనలో మునిగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. మొన్నటి వరకు కేవలం వందల్లో  మాత్రమే ఉన్న కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం వేలల్లో కి చేరుకుంది. దీంతో మరోసారి కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.  కాగా ప్రస్తుతం రోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.



 మాస్కు పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి భారీ జరిమానాలు విధించేందుకు కూడా సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాప్తిపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ  మరణాల సంఖ్య తక్కువగానే ఉందని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అంటూ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ప్రస్తుతం అదే మనకు శ్రీరామరక్ష గా నిలుస్తుంది అని తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని అంతేకాకుండా  వైరస్ పై వస్తున్న పుకార్లను నమ్మవద్దు అంటూ సూచించారు ఈటెల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: