ఉండవల్లి అమ్ముడు పోయారా... కొత్త డౌట్ ?
ఇదే సమయంలో జగన్‌కు జైలు కొత్తకాదు కదా? అని ప్రశ్నించారు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థి వర్గాలకు ఆయుధాలను అందిం చినట్టే అవుతుందని.. ఇదే ప్రశ్నలు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని ఎందుకు ప్రశ్నించరు? కనీసం.. ప్రతిపక్షంపై కూడా ఆయన పట్టించుకుని తీరాలి కదా? అంటున్నారు వైసీపీ నాయకులు. అంతేకాదు.. ఉండవల్లి తిరుపతి ఉప ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని వైసీపీ సీనియర్లు పేర్కొన్నారు. ఇది పూర్తిగా అటు బీజేపీకి కానీ.. ఇటు టీడీపీకి కానీ.. ఆయన మేలు చేస్తున్నట్టుగా భావిస్తున్నామని అంటున్నారు.
ఇప్పటి వరకు ఉండవల్లి ఏం చెప్పినా.. కొన్ని పరిమితులకు లోబడి మాట్టాడారని.. కానీ, ఇప్పుడు పూర్తిగా ఆయన ఎవరి పక్షంలోనో ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారని సీనియర్లు పేర్కొంటున్నారు. ఇక, ఇదే విషయంపై సీఎం జగన్ కూడా సీరియస్‌గా ఉన్నారని అంటున్నారు. ఉండవల్లి వ్యాఖ్యలు.. సీఎం జగన్ పరువు తీసేలా ఉన్నాయని .. కొందరు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఆ వ్యాఖ్యల ఆధారంగా ఆయనపై కేసు పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఏదైనా ఉంటే.. ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడాన్ని తాము తప్పుపట్టబోమని.. కానీ.. ఏకంగా ఒక సీఎంను జైలుకు వెళ్లమని.. జైలు కొత్తకాదుకదా? అని వ్యాఖ్యానించి.. పరువుకు భంగం కలిగించారనేది సీనియర్ అదికారులుచెబుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యల ద్వారా.. ఎన్నికల ప్రక్రియను కూడా ప్రభావితం చేయాలని ఉండవల్లి భావించినట్టు వైసీపీ వర్గాలు చర్చిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని.. కేసు పెట్టే యోచనలో ఉన్నాయని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.