ఎమ్మార్వో ఆఫీస్ కి తాళం వేసిన. మహిళ.. ఎందుకో తెలుసా..?

praveen
ఈ మధ్యకాలంలో ప్రభుత్వాసుపత్రుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజల పాలిట శాపంగా మారిపోతుంది. వివిధ సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నా ఎంతోమందికి చివరికి నిరాశ తప్పడం లేదు అన్నది అర్థం అవుతుంది. ముఖ్యంగా రైతుల విషయంలో అటు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకూ తెరమీదకు వస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఎంతోమంది అక్రమార్కులు అమాయకపు రైతుల భూములను అక్రమంగా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం..  ఆ తర్వాత రైతులు తమ భూమిని వేరొకరూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తమకు న్యాయం చేయాలి అంటూ అధికారుల చుట్టూ తిరగడం లాంటివి జరుగుతున్నాయి.

 అయితే ఇలా ఎంతో మంది రైతులు ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగినప్పటికి అటు ప్రభుత్వ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  ఈ క్రమంలోనే ఎంతో మంది రైతులు ఇక ప్రభుత్వ అధికారుల తీరుతో విసిగి పోయి ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు. గతంలో ఇలాగే భూమి విషయంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మరో మహిళా రైతు కూడా తన సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అధికారుల అలసత్వం వహించడం తో ఊహించని షాక్ ఇచ్చింది.

  ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసింది మహిళ. జోగులాంబ గద్వాల జిల్లా తాటికొండ కు చెందిన వీరమ్మ అనే మహిళకు సంబంధించిన మూడు ఎకరాల భూమిని కొంతమంది అక్రమార్కులు ఇక ఆమెకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న వీరమ్మ ఇక తనకు న్యాయం చేయాలి అంటూ అటు ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్ళింది.  సర్వే రిపోర్ట్ కోసం ఏడాదిగా తిరుగుతూ ఉన్నప్పటికీ ఆ మహిళకు న్యాయం జరగలేదు. చివరికి అధికారుల తీరుతో విసిగి పోయిన వీరమ్మ ఇక ఏకంగా ఎమ్మార్వో ఆఫీస్ కి తాళం వేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బెదిరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: