శివసేన వ్యవహారం.. ప్రజాస్వామ్యంలో పెద్ద గుణపాఠం..?

praveen
మహారాష్ట్రలో ఎన్నో కీలక పరిణామాలు తర్వాత శివసేన అధికారాన్ని చేపట్టే కలిగింది.  మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి అన్ని పార్టీల కంటే అత్యధిక మెజార్టీ వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్  మాత్రం రాలేకపోయింది. ఈ క్రమంలోనే ఇతర పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న శివసేన పార్టీ ముఖ్యమంత్రి పదవి తమకే ఇవ్వాలని కోరడం తో అటు బిజెపి దానికి అంగీకరించకపోవడం.. ఇక ఆ తర్వాత పొత్తు విరమించుకుని ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలతో పొత్తు పెట్టుకున్న శివసేన పార్టీ ఇక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలా శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి అటు మహారాష్ట్రలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 అయితే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాగా ప్రస్తుతం శివసేన ప్రభుత్వ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎలాంటి పనులు చేసినా సర్దుకుపోవాల్సిన పరిస్థితి.. కాదు కూడదు అని నిలదీస్తే ఇతర పార్టీల నేతలు  వారితో పాటు ఉన్న ఎమ్మెల్యేలతో పక్కకు తప్పుకుంటే చివరికి సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుంది. అందుకే శివసేన  ఎన్సీపీ కాంగ్రెస్ నేతలు ఏమి చేసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.  ఈ క్రమంలోనే మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై అటు విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఒకప్పుడు మాఫియా సామ్రాజ్యంగా ఉండే మహారాష్ట్ర ఆ తర్వాత మాత్రం విముక్తి పొందింది.  కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా మాఫియా సామ్రాజ్యం గా మార్చే విధంగా శివసేన సంకీర్ణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు. మరోసారి ఎలాగో అధికారంలోకి రాము అన్న విషయం తెలిసే ఇక అందినకాడికి దోచుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు దేశభక్తికి పారిశ్రామిక అభివృద్ధికి తామే కారణం అని చెప్పిన శివసేన.. నేడు మాత్రం ఏకంగా మహారాష్ట్ర యొక్క పాలనను మాఫియా సామ్రాజ్యంగా మారుస్తుందని ప్రస్తుతం ప్రజాస్వామ్య రాజ్యంలో శివసేన తీరు అందరికీ ఒక పెద్ద పాఠం లాంటిది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: