వైశ్య ఘోష: ఏపీలో వైశ్యులను రాజకీయంగా చీలుస్తున్నారా ?
``మాకు అన్ని రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలుఉన్నాయి. ఎన్నికల సమయంలో మేం అన్ని పార్టీలకూ సాయం చేస్తూనే ఉన్నాం. కొన్ని పార్టీలు మమ్మల్ని వాడుకుంటున్నాయి. కొందరు మాకు పదవులు ఇస్తున్నారు. మరికొందరు ఇవ్వడం లేదు. అయినా.. మాకు రాజకీయాలను ప్రభావితం చేయాలని.. శాసించాలని అనుకోవడం లేదు. అన్ని పార్టీలలోనూ మాకు ప్రాధాన్యం ఉండాలని కోరుకుంటున్నాం. అయితే.. ఇప్పటి వరకు లేని విధంగా మాలో మాకు రాజకీయ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీలపరంగా మమ్మల్ని వేరు చేయాలని చూస్తున్నారు. ఇది సరికాదు. మాకు అన్ని పార్టీలూ ఒక్కటే`` అని సదరు ప్రకటనలో తెలిపారు.
ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఇప్పటి వరకు వైశ్య సామాజిక వర్గంలో ఎలాంటి విభేదాలు లేవు. ఏదైనా సమస్య ఉన్నప్పటికీ.. వారు చర్చించుకుని పరిష్కరించుకుంటున్నారు.కానీ, ఇటీవల కాలంలో మీరు ఆ పార్టీకి మద్దతిస్తారు కాబట్టి.. అనే మాట వినిపిస్తోంది. కొన్నాళ్ల కిందట ఇదేవిధంగా విజయవాడలో వైశ్య సామాజిక వర్గం సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు.. ఏకంగా మంత్రి స్తాయిలోనే వీరిపై ఒత్తిళ్లు వచ్చాయి. అప్పట్లోనూ వీరుతమకు అన్ని పార్టీలూ సమానమేనని వెల్లడించారు.కానీ, ఇప్పటికీ వీరిని వేరు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి వీటిని ఎవరు అడ్డుకుంటారో.. ఎప్పుడు అడ్డుకుంటారో.. చూడాలి.
వైశ్య సామాజిక వర్గానికి చెందిన నిజమైన కోరికలు.. డిమాండ్లు.. సాధించుకునేందుకు.. అటు ప్రభుత్వానికి, ఇటు రాజకీయ నేతలకు తమ గళాన్ని వినిపించేందుకు వైశ్యుల పక్షాన నడుం బిగించింది https://www.indiaherald.com. వైశ్య సామాజిక వర్గం సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, వారికి అన్ని విధాలా అండగా నిలిచేందుకు https://www.indiaherald.com నిర్ణయించింది.
వైశ్య సామాజిక వర్గం సోదరులు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు.. చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..! మీ తరఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/వినిపిస్తుంది. మీ సమస్యల పరిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్యమంలో ప్రతి వైశ్య సోదర, సోదరీమణులకు భాగస్వామ్యం కల్పిస్తోందిhttps://www.indiaherald.com/