తిరుపతి బై పోల్: అదే జరిగితే జగన్‌కు బాబు చెక్ పెట్టినట్లేనా?

M N Amaleswara rao
ఏపీలో మరో ఎన్నికల పోరు మొదలైంది. ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున బల్లి దుర్గా ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఆయన గత ఏడాది కరోనాతో మరణించడంతో తిరుపతి స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు మరోసారి హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్ధులు ఖరారైపోయారు. అటు జనసేన మద్ధతుతో బీజేపీ అభ్యర్ధి తిరుపతి బరిలో నిలబడుతున్నారు.
అయితే బీజేపీ అభ్యర్ధి పోటీలో ఉన్నా సరే ప్రధాన పోటీ మాత్రం వైసీపీ-టీడీపీల మధ్యే ఉంటుంది. కాకపోతే జనసేన సపోర్ట్ చేయడం వల్ల బీజేపీకి ఎన్ని ఓట్లు పెరుగుతాయనేది మేటర్. అదే సమయంలో వైసీపీకి గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ ఇప్పుడు వస్తుందా? అలాగే టీడీపీ కూడా మంచిగా ఓట్లు రాబడుతుందా? అనే విషయాలని ఒక్కసారి పరిశీలిస్తే...ప్రస్తుత పరిస్థితిల్లో అధికార వైసీపీ గెలుపు ఖాయం. అందులో ఎలాంటి అనుమానం లేదు.
ఎందుకంటే అది వైసీపీ సిట్టింగ్ సీటు. పైగా అధికార పార్టీ. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎలాంటి విజయలని సాధించిందో తెలిసిందే. అలాగే జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంకా ప్లస్ అవుతాయి. వీటిని బట్టి చూస్తే వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకే. అలాగే 2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే...ఈ సారి భారీ మెజారిటీ రావడం ఖాయమని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి దాదాపు 2.28 లక్షల మెజారిటీ వచ్చింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువే వస్తుందని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
అదే సమయంలో వైసీపీకి ధీటుగా ఓట్లు తెచ్చుకోవాలని టీడీపీ చూస్తోంది. ఒకవేళ 2019 కంటే వైసీపీ మెజారిటీ తగ్గిస్తే టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ ఉన్నట్లే. అలాగే చంద్రబాబు, జగన్ హవా తగ్గించినట్లు అవుతుంది. మరి చూడాలి తిరుపతి బై పోల్‌లో ఏ పార్టీ సత్తా చాటుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: