ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు వెళ్తే.. చివరికి ప్రాణం పోయింది..?

praveen
ఈ మధ్యకాలంలో బర్త్ డే పార్టీలను సెలబ్రేట్ చేసుకోవడం అన్నది సర్వసాధారణంగా మారిపోయింది. ఎవరికి వారు వారి ఆర్థిక పరిస్థితులను బట్టి బర్త్ డే పార్టీలను సెలబ్రేట్ చేసుకొంటున్నారు. కొంతమంది అయితే వారి ఆర్థిక స్తోమత కంటే ఎక్కువ ఘనంగా బర్త్ డే వేడుకలు జరుపుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.  ఇక బర్త్ డే వేడుకలు జరిగాయి అంటే ఫుల్లుగా తాగడం ఆ తర్వాత చిందులు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు.  బర్త్ డే వేడుకలు ఎంతో సంతోషంగా సాగి పోతూ ఉంటాయి అని అందరూ అనుకుంటారు.  కానీ అదే బర్త్ డే వేడుకలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.



 నేటి రోజుల్లో బర్త్ డే సెలబ్రేషన్స్ కారణంగా ఎంతోమంది రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.  ఎన్నో కుటుంబాలు విషాదంలో మునిగి పోతున్నాయి. ఇటీవలే పుట్టినరోజు వేడుక ఓ యువకుడి ప్రాణం తీసింది ఎంతో సంతోషంగా స్నేహితుని పుట్టినరోజు వేడుకకు వెళ్ళిన యువకుడు తిరిగి వచ్చే క్రమంలో చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా మెట్పల్లి కి చెందిన రాము అనే 22 ఏళ్ల యువకుడు ఘట్కేసర్ లోనే శ్రీనిధి కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు.



 రాముకి అదే అదే ప్రాంతంలో ఉండే మహేష్ అనే వ్యక్తి పరిచయం కాగా...  ఇద్దరు కలిసి ఒకటే దగ్గర ఉంటున్నారు.  అయితే ఇటీవలే రాంపల్లి లోని ఓ హోటల్ లో స్నేహితుడి బర్త్ డే వేడుకలు జరిగగా ఆ పార్టీ లో పాల్గొన్నారూ రాము,మహేష్ లు. ఇక ఆ తర్వాత అక్కడ మద్యం సేవించారు. చివరికి బైక్ పై తిరుగు ప్రయాణం  అయ్యి హాస్టల్ కు బయలు దేరగా ఇక చీకట్లో అతి వేగంగా నడపడంతో రైల్వే బ్రిడ్జి వంతెనపై నుంచి ఫుట్ పాత్ ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో రాము అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. భారీ శబ్దానికి మేల్కొన్న స్థానికులు వారిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: