రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్ లోకి డబ్బులు వచ్చేది అప్పుడే..?

praveen
కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది  అన్న విషయం తెలిసిందే.  దేశ వ్యాప్తంగా రైతులు అందరు కూడా ఎంతో ప్రయోజనం పొందే విధంగా  ఇప్పటికే ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇక ఆయా పథకాల ద్వారా రైతులందరికీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇప్పటికే ఎంతో మంది రైతులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా ఎంతగానో లబ్ధి పొందుతున్నారు అనే విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం తీసుకొచ్చిన పథకాలలో పీఎం కిసాన్ యోజన పథకం కూడా ఒకటి.



 ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా పీఎం  కిసాన్ పథకం లో భాగంగా ప్రతి ఏటా పెట్టుబడి సాయం అందుతుంది. నేరుగా రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి ఏటా 6వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆరు వేల రూపాయలను ఒకే సారి కాకుండా మూడు విడతల్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులు అయిన రైతులందరికీ కూడా పీఎం కిసాన్ యోజన పథకం లో భాగంగా డబ్బులు ఖాతాలలో జమ అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే.




 ఇక ఇప్పటికే ఏకంగా ఏడు విడుదలకు సంబంధించిన పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల బ్యాంకు అకౌంట్లో జమ అయ్యాయి. ఇక 8వ  విడత పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ డబ్బులను ఈనెలాఖరులోగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు పీఎం కిసాన్ యోజన పథకంలో చేరకుండా ఉంటే వెంటనే ఈ పథకంలో చేరడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఈ పథకం లో చేరడం ద్వారా కేవలం పెట్టుబడి సాయం పొందడమే కాదు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: