అల్లు అరవింద్ పుష్ప ప్లాన్ బెడిసికొట్టేసిందా.. ప్రస్తుతం ఇదే టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప మూవీ గురించి అల్లు అరవింద్ ప్రస్తావించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫ్యూచర్ సిటీ పేరుతో ఎన్నో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై సినిమా ఇండస్ట్రీ ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనేదాని గురించి తెలిపారు. ఇందులో భాగంగా ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. అలా ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ కూడా వచ్చారు.అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన అల్లు అరవింద్ పుష్ప గురించి గొప్పగా చెబుతూ బొక్క బోర్లా పడ్డారు.
అల్లు అరవింద్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్స్, అవేంజర్స్ లాంటి మూవీస్ తీయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఊళ్లలోకి వెళ్లి మూలాలను వెతుక్కుంటూ నిజ జీవిత కథలను తెరకెక్కిస్తే చాలు. దీనికి ఉదాహరణగా కాంతార,పుష్ప సినిమాలను చెప్పుకోవచ్చు అంటూ అల్లు అరవింద్ మాట్లాడారు. అయితే అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు బాగానే ఉన్నప్పటికీ ఉదాహరణకు పుష్ప సినిమాను చెప్పడం మాత్రం అస్సలు బాలేదు అంటున్నారు నెటిజన్స్. అయితే కాంతార సినిమా ఓకే.. ఎందుకంటే ఇది కర్ణాటక రాష్ట్రానికి చెందిన పవిత్రమైన గ్రామదేవ కి సంబంధించిన స్టోరీని తెరకెక్కించారు. కానీ ఇందులో ఉదాహరణగా పుష్ప సినిమాని ఎందుకు ప్రస్తావించారు. పుష్ప సినిమా ఏమైనా ఇన్స్పిరేషన్ అయ్యే మూవీ నా.. ఈ సినిమా చూసి ఏం నేర్చుకోవాలి.. ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేయాలో నేర్చుకోవాలా..
పోలీసులను ఎలా బోల్తా కొట్టించాలి.. వారిని ఎలా ఎర్రి పప్పలని చేయాలి అనేది నేర్చుకోవాలా.. ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం నేరం. అలాంటి నేరాన్ని ప్రోత్సహిస్తూ ఈ సినిమాని తీశారు.అయితే ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కటి సినిమా పరంగా చూసుకుంటే అద్భుతమే.కానీ ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి ఏమీ లేదు. ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకుంటే మాత్రం అందరూ ఎర్రచందనం దొంగలు అవ్వడమే అంటూ చాలా మంది నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అంతేకాకుండా సినిమాకి అవార్డులు వచ్చాయి ఒప్పుకుంటాం కానీ అది యాక్టింగ్ కి డైరెక్షన్ కి మాత్రమే చెందుతుంది.ఆ సినిమా నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సింది ఏమీ లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అల్లు అరవింద్ గ్లోబల్ సమ్మిట్లో పుష్ప ప్రస్తావన తెచ్చి సోషల్ మీడియాలో విమర్శలకు గురయ్యారని చెప్పుకోవచ్చు.