టాలీవుడ్ హీరోయిన్ సమంత, ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఇటీవలే రెండో వివాహం చేసుకోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. డిసెంబర్ 1 కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ లో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం చేసుకున్నారు. దీంతో సినీ సెలబ్రిటీలు ,అభిమానులు కూడా ఈ జంటకి శుభాకాంక్షలు తెలిపారు. అదే సందర్భంలో సమంత పైన చాలానే విమర్శలు, ట్రోల్స్ కూడా వినిపించాయి.
ఏ విషయంలోనైనా సరే మొహమాటం లేకుండా మాట్లాడేటటువంటి నటి ,బిజెపి నాయకురాలు మాధవి లత తన సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తూ ట్రోలర్లకి గట్టి కౌంటర్ ఇచ్చింది. మాధవి లత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మాధవి లత వీడియోలో మాట్లాడుతూ.. సమంత వివాహం చేసుకుంటే కొంతమందికి ఎందుకు అంత బాధ? ఆమె ఎవరిదో సంసారం కూల్చింది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసేముందు మీరు ఎన్ని రిలేషన్షిప్ లో ఉన్నారు ప్రశ్నించుకోవాలని తెలిపింది.
మరొకరి పెళ్లి చెడగొట్టి వివాహం చేసుకున్న వాళ్లు, విడాకులు ఇవ్వకుండా వ్యవహారాలను నడిపిస్తున్న వారే ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటే నాకు నవ్వొస్తుంది. మీరేమి పతివ్రతలు కాదు కదా! ఇలాంటి కామెంట్స్ చేసే వారి గురించి నాకు బాగా తెలుసు అంటూ విమర్శలకు సైతం అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది నటి మాధవి లత. తాజాగా ఈ వీడియో వైరల్ గా మారడంతో సమంత అభిమానులు మాధవి లత వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉండగా మరి కొంతమంది ఇలాంటి వ్యక్తిగత విషయల పై వీడియోలు అవసరమా అంటూ మాధవి లతను ప్రశ్నిస్తున్నారు?. ఏది ఏమైనప్పటికీ సమంత రెండో పెళ్లి పై జరుగుతున్న చర్చలకు సైతం మాధవి లత ఇలా కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.