అనుష్క గోరుముద్దలు.. నాగార్జున వార్నింగ్.. దర్శకుడు బయటపెట్టిన టాప్ సీక్రేట్..!?

Thota Jaya Madhuri
తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే జంటలలో నాగార్జున–అనుష్క జంట ఒకటి. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతోనే అనుష్కకు తెలుగు తెరపై భవ్యతరమైన ఎంట్రీ లభించింది. ఆ సినిమా విడుదలతోపాటు ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.ఆ తరువాత వచ్చిన ‘అరుంధతి’ చిత్రంతో అనుష్క తన కెరీర్‌లోనే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే గుర్తింపును కూడా పొందింది. బాహుబలి వంటి భారీ చిత్రంతో మరింత ఎత్తుకు ఎదిగి, ఏకంగా పాన్–ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంది అనుష్క.అయితే, అరుంధతి తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన పంచాక్షరి మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన సముద్ర ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించీ, అనుష్క గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.



“నాగార్జున ఇచ్చిన స్వీట్ వార్నింగ్!” – దర్శకుడు సముద్ర

సముద్ర మాట్లాడుతూ…“అనుష్కతో కలిసి నేను పంచాక్షరి అనే సినిమా తీశాను. ఆ చిత్రానికి నాగార్జున గారి మేకప్ మేన్ చంద్ర నిర్మాతగా వ్యవహరించాడు. నాగార్జున గారు ఒకసారి నన్ను గోవాకు పిలిచి చాలా ప్రేమగా మాట్లాడారు. ‘అరుంధతి’ సినిమాను శ్యామ్ ప్రసాద్ రెడ్డి వంటి ఎంతో పెద్ద నిర్మాత తీశాడు. కానీ ‘పంచాక్షరి’ కోసం నా దగ్గర పనిచేసే చంద్ర నిర్మాతగా మారాడు. అతను అంత పెద్ద నిర్మాత కాదు. కాబట్టి ఈ సినిమాతో అతని జీవితం మార్చేలా మీరు చూసుకోండి… అని నాగార్జున స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు” అని సముద్ర చెప్పుకొచ్చారు.



అంతే కాదు… “తన దగ్గర పనిచేసిన వాళ్లను నాగార్జున ఎలా కేర్‌ చేసుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. ఒకవిధంగా కుటుంబంలో వారిని చూసుకునేటట్లే ప్రవర్తిస్తారు” అంటూ నాగార్జునపై ప్రశంసలు కురిపించారు.“అనుష్క నాకు గోరుముద్దలు పెట్టేది” – అద్భుతమైన మెమొరీస్ ఇవి. సముద్ర అక్కడితో ఆగకుండా, మరింత ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ—“సుమంత్, అనుష్క కలసి చేసిన మహానంది సినిమా షూటింగ్ సమయంలో అనుష్క నా కోసం గోరుముద్దలు పెట్టేది. చాలా మమతతో చూసుకునేది. అదే ప్రేమ, అదే జాగ్రత్తను పంచాక్షరి సమయంలో కూడా చూపించింది” అన్నారు. అయితే, స్టార్ హీరోయిన్ అయ్యాక ఆమె నడవడికలో కొంత మార్పు వచ్చినప్పటికీ, అనుష్కమనసు మాత్రం ఇప్పటికీ అంతే మంచిదిగానే ఉందని, ఆమె తన సహజ స్వభావాన్ని ఎప్పటికీ మార్చుకోలేదని చెప్పారు. దర్శకుడు సముద్ర మాటల్లో నాగార్జున, అనుష్క ఇద్దరికీ ఉన్న పరస్పర గౌరవం, కేర్, మానవీయత స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాలు ఎంత పెద్ద హిట్లే అయినా, వాళ్లు కలిసి పనిచేసిన రోజులు, పంచుకున్న భావోద్వేగాలు మాత్రం ఎప్పటికీ మరవలేనివే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: