వయసుతో వచ్చే కంటి సమస్యలకు చెక్ పెట్టండి ఇలా..!?
అయితే ఆప్రికాట్ లో పీచు పదార్ధం పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. అంతే కాదు, క్రమం తప్పకుండా పేగులను శుభ్రపరుస్తుంది. ప్రేవుల్లో ఏర్పడే సమస్యలనుంచి రక్షిస్తుంది. ఆంటీకాదు మలబద్ధకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను దరి చేరనీయదు. ఇక ఆప్రికాట్లు కంటి చూపును మెరుగుపరుస్తుంది. అంధత్వాన్ని త్వరగా రానీయదు. ఈ పండులో కంటిచూపును కాపాడే కెరోటినాయిడ్లు, శాంతోఫిల్స్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో వయసు రీత్యా వచ్చే కంటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలుస్తోంది.
ఆప్రికాట్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాదు ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో బరువు తగ్గవచ్చు. ఫైబర్ కొవ్వును తగ్గిస్తుంది. కొన్ని రకాలైన గుండె సంబంధిత వ్యాధులను, గుండె పోటును నివారిస్తుంది. ఇక దీనిలో అధికంగా ఐరెన్ ఉండడం వల్ల ఈ పండు తిన్నవారికి రక్తహీనత దరిచేరదు. అంతేకాదు రక్తంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దీనిలో పిండి పదార్ధాలు అతి తక్కువగా ఉండడంతో మధుమేహ బాధితులు ఈ పండును అధికమొత్తంలో తినవచ్చు.
ఆప్రికాట్లలో బీటా-క్రిప్టోక్సంతిన్ అనే రసాయనం అధికంగా ఉంది. ఇది ఆస్టియో ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ సమస్య వల్ల కలిగే నొప్పిని నివారించగలదని ఆర్థరైటిస్ ఫౌండేషన్ యొక్క నివేదిక ప్రకారం తెలుస్తోంది. ఆప్రికాట్ కాలేయానికి ఎంతో మేలు చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ఫ్యటీ లివర్ వ్యాధి నుంచి బయటపడేలా చేస్తుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఉబ్బసం, జలుబు, ఫ్లూ లక్షణాలు ఉన్నవారు ఆప్రికాట్ తినడం వల్ల వాటి నుంచి ఉపశమనం కలుగుతుందని కొన్ని పరిశోధనలద్వారా తెలిసింది. ఈ పండులో అధికంగా విటమిన్ ఇ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.