బ్రేకింగ్ న్యూస్ : లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం సీరియ‌స్‌..ఐసీయూలో చికిత్స‌

Spyder
దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది.  ప్రస్తుతం ఆయనకు రాంచీలోని రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. బీహార్‌ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలే ప్రసాద్‌ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యం విషమించడంతో రాంచిలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో లాలూ కొంతకాలంగా బాధపడుతున్నారు. లాలూ కిడ్నీలు 75 శాతం చెడిపోయాయని రిమ్స్ డాక్టర్లు తెలిపారు. పరిస్థితిని బట్టి ఆయనకు డయాలలిస్ చేస్తామని వెల్లడించారు. మరోవైపు లాలూ చిన్నకుమారుడు బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, లాలూ సతీమణి రబ్రీ దేవి ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి రాంచీ వెళ్లారు.

డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ సారథ్యంలోని వైద్య బృందం లాలూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ.. లాలూ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు పలు పరీక్షలు చేశామని తెలిపారు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనలో స్వల్ప న్యుమోనియా లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఈ అంశంపై ఎయిమ్స్ నిపుణులను సంప్రదించామని, వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ‘లాలూకి నిర్వహించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్‌లో కోవిడ్ నెగెటివ్‌గా వచ్చింది.. నమూనాలను సేకరించి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌కు పంపాం.. ఫలితాలు శుక్రవారం వస్తాయి’ అని డాక్టర్ ప్రసాద్ తెలిపారు.

వాస్త‌వానికి పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 1990ల్లో లాలూ బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కామ్ జరిగింది. సుదీర్ఘ కాలం పాటు విచారణ సాగిన ఈ కేసులో 2017 డిసెంబరులో దోషిగా తేలడంతో శిక్ష ఖరారైంది. నాటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా లాలూకు పెరోల్‌ ఇవ్వాలని ఇటీవల ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ కోరారు. జైల్లో తరచూ ఆయన అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు.  ఇలా జ‌రుగుతున్న క్ర‌మంలోనే లాలూ నిజంగానే తీవ్ర అనారోగ్యానికి గురికావ‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: