మీ మేధా శక్తిని పెంచుకోవడానికి వీటిని తప్పకుండా తినండి.. !!

Suma Kallamadi
మన పెద్దవాళ్ళు ఒక్కోసారి మనిషివి అయితే ఎదిగావ్ గాని బ్రెయిన్ అయితే ఎదగలేదు అని అంటూ ఉంటారు కదా.అందరిలో జ్ఞాపక శక్తి అనేది ఒక్కోలాగా ఉండదు. మనిషి మనిషికి జ్ఞాపక శక్తి అనేది వేరేగా ఉంటుంది. అయితే మీ జ్ఞాపక శక్తి అనేది పెంచుకోవాలంటే మీరు మేము చెప్పిన ఈ టిప్స్ ని అనుసరించి మీ బ్రెయిన్ పవర్ ని  పెంచుకోవచ్చు. మీలో చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉండే ఉంటుంది కదా. అయితే ఈ కాఫీని తాగడం వల్ల చాలా మంచి జరుగుతుంది అంట. ఈ కాఫీలో ఉండే కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్స్ మీ బ్రెయిన్ కి సహాయం చేస్తాయి. కాఫీని ఎక్కువ కాలం తాగడం వల్ల న్యూరోలాజికల్ సమస్యలు అనేవి దరిచేరవు.అలాగే పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి రోగాలు కూడా మీ దరి చేరవు. 



అలాగే పండ్లలో కమలాలు, ద్రాక్ష పండ్లు, నిమ్మ కాయలు, బ్లాక్ కరెంట్ వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఆహార పదార్ధాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచింది. పైగా ఇవి ఒత్తిడిని, డిప్రెషన్ ను కూడా తగ్గిస్తాయి. అలాగే బాదం పప్పులు తినడం కూడా  బ్రెయిన్ కి మంచిది అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని తగ్గించడంలో బాదం బాగా సహాయపడుతాయి. బ్లూబెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. బ్రెయిన్ హెల్త్ కి ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి మీకు దొరికినప్పుడల్లా బ్లూ బెర్రీస్ ను మీ ఆహారంలో భాగంగా తింటూ ఉండండి.  



అలాగే డార్క్ చాక్లెట్,  కోకో పౌడర్ కూడా బ్రెయిన్ హెల్త్ కు బాగా ఉపయోగపడుతుంది దానిలో ఉండే ఫ్లవనోయిడ్స్ కెఫిన్,  యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే ప్రతి రోజు గ్రీన్ టీ తాగడం వలన మీ బ్రెయిన్ కి మంచి సపోర్ట్ ఉంటుంది. దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ కి రక్షణగా ఉంటాయి.. అలానే మీరు అలసిపోయినప్పుడు రిలాక్స్ గా ఉండడానికి గ్రీన్ టీ తాగితే బాగా ఉపయోగపడుతుంది.అలాగే ఆక్రోట్స్ రోజువారీ ఆహారంలో తీసుకోవడం వలన కూడా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. పైన తెలిపిన ఆహార పదార్ధాలు మీ రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉంటుంటే మీ జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది.. !!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: