గర్భిణీ స్త్రీ కడుపులో ఆడపిల్ల పెరుగుతుంది అనడానికి ఇది ఒక సంకేతం అంట.. !!
అయితే ఆడశిశువుని గర్భంలో మోస్తుంటే కనుక ఆ గర్భవతి యొక్క గర్భం చూడడానికి పెద్దగా ఉంటుందట.కానీ ఇప్పుడు మనకి అన్నీ ఆధునిక పరికరాలు అందుబాటులో ఉండడం వలన కొన్ని నెలలు నిండగానే స్కానింగ్ పద్దతిలో తల్లి గర్భంలో ఉన్న శిశువు యొక్క లింగ నిర్దారణ చేసేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలాంటి లింగ నిర్దారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం అనే చెప్పాలి. ఎందుకంటే మన భారతదేశంలో కొన్ని చోట్ల గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే వెంటనే గర్భాన్ని తీయించి వేస్తున్నారు.
పూర్వకాలంలో మన బామ్మలు గర్భిణీ స్త్రీ యొక్క పొట్ట పెద్దదిగా ఉంటే ఆడశిశివు పుడుతుంది అనడానికి ఒక కారణం కూడా ఉందట. ఎందుకంటే ఆడ శిశువు ఉన్న గర్భం లో శిశువు చుట్టూ ఉండే ద్రవపదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుందట. అందుకే మగ శిశువు చుట్టూ ఉన్న ద్రవపదార్ధంతో పోలిస్తే ఆడ శిశువు చుట్టూ ఉండే ద్రవపదార్ధం మోతాదు ఎక్కువ ప్రమాణంలో ఉంటుందట. కాబట్టి ఒకవేళ గర్భంలో మగ శిశువు ఉంటే ఆ గర్భం కాస్త చిన్నదిగా కనిపిస్తుంది. అదే ఆడపిల్ల అయితే ఆ గర్భం పెద్దదిగా కనిపిస్తుంది..ఈ చిన్న లాజిక్ వల్లనే మన పేదవాళ్ళు ఆడశిశువు కడుపులో ఉంటే కడుపు పెద్దదిగా ఉంటుందని అంటూ ఉంటారు. అయినాగానీ ఆడపిల్ల అయిన మగపిల్లాడు అయినాగానీ భూమి మీదకి రాని పసికందును చంపండం నేరం అని గుర్తుపెట్టుకోవాలి.. !!