పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

Chaganti
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మరీ ముఖ్యంగా అన్ని జిల్లాల కంటే అనంతపురం జిల్లాలో ఉత్కంఠ పరిణామాల మధ్య నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ ముగిసింది. ఎవరు ఎప్పుడు జంప్ అవుతారో తెలియని నేపథ్యంలో కొన్ని మున్సిపాలిటీలకు చెందిన టీడీపీ నేతలు రెండు రోజుల పాటు క్యాంప్ రాజకీయాలు చేసి తమ అభ్యర్థులను కాపాడుకున్నారు. అయినప్పటికీ జిల్లాలో వైసీపీ 21 వార్డుల్లో ఏకగ్రీవం చేసుకుంది. ఇక లెక్క ప్రకారం జిల్లా మొత్తం మీద 358 వార్డులు ఉన్నాయి, అందులో వైసీపీ ఏకగ్రీవాలు - 21 ఉన్నాయి.  

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చక్రం తిప్పి అత్యధికంగా 10 వార్డులు ఏకగ్రీవం చేసుకున్నారు. ఇక గుత్తిలో 6, గుంతకల్లులో 3, తాడిపత్రి మున్సిపాలిటీలో 2 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రాయదుర్గం మున్సిపాలిటీలో 32 వార్డులకు  గాను  78 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.గుంతకల్లు మున్సిపాలిటీ లో ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 34 వార్డుల్లో 110 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మడకశిర నగర పంచాయతీలో 20 వార్డులలో 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.కళ్యాణదుర్గంలో 24 వార్డులకు 118 మంది అభ్యర్థులు ఉన్నారు. 

నిజానికి జిల్లా అంతా ఎక్కువగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉండడంతో తమ తమ నియోజకవర్గాల్లోని వార్డులను ఏకగ్రీవం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే టీడీపీ నాయకులు తమ అభ్యర్థులను కాపాడుకునేందుకు ఇతర ప్రాంతాలకు తరలించి క్యాంపులు ఏర్పాటు చేశారు. దీంతో ఒకరకంగా టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పచ్చు. కళ్యాణదుర్గం, రాయదుర్గం మునిసిపల్ టీడీపీ అభ్యర్థులను కర్ణాటకలో వివిధ ప్రాంతాలకు తరలించగా.. అనంతపురంతో పాటు పలు ప్రాంతాల్లో నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ధర్మవరం ఇన్ ఛార్జ్ గా ఉన్న పరిటాల శ్రీరామ్ టీడీపీ అభ్యర్థులను తన సొంత అడ్డా అయిన వెంకటాపురం తరలించి ఏకగ్రీవాలకు టీడీపీ అడ్డుపడిందని చెప్పచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: