వాట్సాప్ : యూజర్ లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేస్తుంది.?

praveen
ప్రస్తుతం భారత్లో వాట్సాప్ వాడటం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ.. విద్యావంతుల నుంచి నిరక్షరాస్యులు వరకు..  ఇలా ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే నేటి రోజుల్లో వాట్సాప్ వాడకం ఎంతలా  పెరిగిపోయింది అంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ అకౌంట్ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఒకప్పుడు సాధారణంగా పక్కన ఉన్న మనుషుల తో మాట్లాడటానికి ఇష్టపడే వారు కానీ నేటి రోజుల్లో వాట్సాప్ వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో మొబైల్ లో ఉన్న మనుషుల తోనే మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

 అంతేకాదు వీడియో కాల్స్ ద్వారా మీటింగ్.. మెసేజ్ ద్వారా చాటింగ్.. ఇక ఆడియో కాల్స్ ద్వారా చిట్  చాటింగ్ చేస్తూ ఎప్పుడు వాట్సాప్ లోనే గంటల తరబడి కాలం గడుపుతున్నారు ఎంతోమంది. అంతలా  వాట్సాప్ వాడకం నేటి రోజుల్లో పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అయితే అటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో అటు వాట్సాప్ కూడా  వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను  అందుబాటులోకి తీసుకు వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రకాల సరికొత్త ఫీచర్లను  అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్.


 ఇటీవలే మరో సరికొత్త ఫీచర్ తో  తమ కస్టమర్లను సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  వాట్సాప్ యూసర్ లు  ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా సెల్ఫ్ డిస్ట్రక్టింగ్  ఫొటోస్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ సిద్ధమైంది. ఇక వాట్సాప్ తీసుకువచ్చిన ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ఒక వేళ మీరు ఎదుటి వ్యక్తికి మీకు సంబంధించిన ఏదైనా మీడియా ఫైల్ పంపిన సమయంలో ఆ వ్యక్తి చూడగానే మీరు పంపిన మీడియా ఫైల్ ఆటోమేటిగ్గా డిలీట్ అవుతూ ఉంటుంది. అవతలి వ్యక్తి మీరు పంపిన మీడియాను సేవ్ చేసుకోవడం షేర్ చేయడం అస్సలు కుదరదు. ఫోటో షేర్ చేసే ముందు యాడ్ క్యాప్షన్ బటన్ పక్కన ఉన్న టైం సింబల్ ను ఆక్టివేట్ చేసుకోవాలి. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ సరికొత్త  ఫీజర్ మరికొన్ని రోజులు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: