పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

VUYYURU SUBHASH
కీల‌క‌మైన తిరుప‌తి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విప‌క్ష టీడీపీ పోటీ చేయ‌కుండానే చేతులు ఎత్తేసింది. ఇక్క‌డ నామినేష‌న్ల ద‌శ‌లో టీడీపీ ఓడిపోయిన‌ట్ల‌య్యింది. ఇక్క‌డ మొత్తం 50 డివిజన్లలో 24 డివిజన్లలో పార్టీ తరపున పోటీ చేయటానికి అసలు అభ్యర్ధులే లేరు. 11 డివిజన్లలో అసలు పార్టీ తరపున నామినేషన్లే వేయలేదు. ఇక మరో 13 డివిజన్లలో పార్టీ తరపున నామినేషన్లు వేసి బీఫారాలు కూడా అందించిన అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహిరించుకుంటున్నట్లు ఇఫ్పటికే రిటర్నింగ్ అధికారులకు లెటర్లు ఇఛ్చేశారు. దీనిని బ‌ట్టి ఇక్కడ పార్టీ ఎంత ద‌య‌నీయ స్థితిలో ఉందో అర్థ‌మ‌వుతోంది.
వాస్త‌వానికి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ కేవ‌లం 700 ఓట్ల స్వ‌ల్ప తేడాతో మాత్ర‌మే ఓడిపోయింది. పార్టీకి మంచి బ‌లం ఉంది. అయితే పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డం.. మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ కేడ‌ర్‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో రెండేళ్ల‌లోనే పార్టీ ఇంత దారుణ స్థితికి దిగ‌జారిపోయింది. క‌నీసం నామినేష‌న్లు వేయండ్రా బాబు అని బ‌తిమిలాడుతున్నా ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు.  
ఉన్న 50 డివిజ‌న్ల‌లో మేయ‌ర్ పీఠం గెల‌వాలంటే క‌నీసం 26 డివిజ‌న్ల‌లో గెల‌వాలి.. అలాంటిది ఇక్క‌డ టీడీపీ పోటీ చేస్తుందే 26 డివిజ‌న్లు...  వీటిల్లో స‌గం కూడా గెలిచే ప‌రిస్థితి లేదు. ఈ జిల్లాలో తిరుపతిలో మాత్రమే కాదు చిత్తూరు పుంగనూరు శ్రీకాళహస్తి మదనపల్లి మున్సిపాలిటిల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్ధితులే కనబడుతున్నాయి. ఏదేమైనా పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూసుకున్న తెలుగు త‌మ్ముళ్లు ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండానే నామినేష‌న్ల ద‌శ‌లోనే చేతులు ఎత్తేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: