టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైకు దొరికితే చాలు స్టేజిపై పవన్ భజన చేయడంలో ముందుంటారు. పవన్ పై బండ్ల చేసిన పొగడ్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కొన్ని సార్లు బండ్ల గణేష్ పొగుడుతన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా పగల బడి నవ్వారంటే బండ్ల ఏ రేంజ్ లో పొగడ్తల వర్షం గుప్పిస్తారో అర్థం చేసుకోవచ్చు. నా దేవుడు పవన్ కళ్యాణ్ అంటూ అనేక సందర్భాల్లో బండ్ల కామెంట్స్ చేశారు. అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. పవన్ పవన్ రావాలి...పాపాలు పోవాలి అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అయితే పవన్ వస్తే ఎవరి పాపాలు పోతాయో మాత్రం బండ్ల గణేష్ చెప్పలేదు. దాంతో బండ్ల గణేష్ ట్వీట్ ఎవరికీ అర్థం కాకుండా పోయింది. దాంతో ఈ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు .
"పవన్ ఎక్కడికి రావాలి సామి..పాపాలు ఎక్కడికి పోతాయి సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు పవన్ ఫ్యాన్స్ "పవన్ కళ్యాణ్ రావాలంటారు..మీరు మాత్రం సపోర్ట్ చేయరు. పార్టీలోకి రారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కల్యాణ్ తీన్మార్ సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరవాత పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి రికార్డులు బద్దలు కొట్టారు. ఈసినిమాతోనే బండ్ల గణేష్ కు నిర్మాతగా గుర్తింపు వచ్చింది. ఇక ఇటీవల బండ్ల గణేష్ మళ్లీ పవన్ తో సినిమా తీస్తున్నట్టు వెళ్లడించారు. కానీ ఆ ప్రాజక్ట్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. దాంతో పవన్ అభిమానులు అప్డేట్ కావాలంటూ కోరుతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: