త్వరలోనే ఎన్నికలు.. మరోవైపు రాజకీయ దుమారం..!

NAGARJUNA NAKKA
దక్షిణాదిన మూడు ప్రాంతాల్లో ఏప్రిల్  6‌న ఒకే విడత ఎన్నికలు జరగనుండగా... పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఎనిమిది విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది.

దేశంలో ఐదు రాష్ట్రాలకు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళలో మల్లాపురం, తమిళనాడులోని కన్యాకుమారి లోక్‌సభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ని జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. తమిళనాడులోని 234 స్థానాలకు, కేరళ లోని 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుశ్చేరిలోని 30 స్థానాలకు, మల్లాపురం, కన్యాకుమరి లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఎన్నికల ఫలితాలు మే2న రానున్నాయి. అయితే, పశ్చిమ్‌ బెంగాల్‌లో మాత్రం.. 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. ఈ నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది.

సమస్యాత్మక ప్రాంతాలు, ఘర్షణలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందునే... అసోం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఎక్కువ విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈసీ చెబుతోంది. అసోంలో మొదటి విడతగా 47 స్థానాలకు మార్చి 27న, రెండో విడతలో 39స్థానాలకు ఏప్రిల్ 1న, మూడో విడతలో 40 స్థానాలకు ఏప్రిల్ 6 ఎన్నికలు నిర్వహించనుంది.

అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కువగా ఉన్న పశ్చిమబెంగాల్ లో 8విడతల్లో  ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 30 సీట్లకు 27 మార్చిన, రెండో దశలో 30 సీట్లకు ఏప్రిల్ 1న, మూడో దశలో 30 సీట్లకు ఏప్రిల్ 6న, నాలుగో దశలో 44 సీట్లకు ఏప్రిల్ 10, ఐదో దశలో 45 సీట్లకు ఏప్రిల్ 17, ఆరో దశలో 43సీట్లకు ఏప్రిల్ 22న, ఏడో దశలో 36సీట్లకు ఏప్రిల్ 26న, 8వ దశలో ఏప్రిల్ 29న జరగనున్నాయి.  అయితే ఈ ఎన్నికలపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: