ద్రాక్ష తింటే.. చర్మం ఇలా అవుతుందా..?
అయితే తాత్కాలికంగా మెడికల్ షాప్ లో దొరికే క్రీమ్స్ వాడి అందాన్ని పెంచుకోవడం కంటే ఇక పలురకాల ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే సహజసిద్ద అందాన్ని పెంచుకోవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం పలు రకాల పండ్లు తినడం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు సూచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కేవలం చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి పైన మెరుగులు దిద్దితే సరిపోదని ఆరోగ్యాన్ని పెంచితే చర్మసౌందర్యం ఆటోమేటిక్ గా మీ సొంతం అవుతుంది అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఇలా చర్మసౌందర్యాన్ని పెంచేందుకు ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు. సూర్యరశ్మి ద్వారా వచ్చే యు.వి కిరణాల నుంచి చర్మం దెబ్బతినకుండా రక్షించి ఎప్పుడూ కాంతివంతంగా ఉంచేందుకు ద్రాక్షలోని పాలి ఫినాల్స్ అనే సహజసిద్ధ గుణం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ద్రాక్ష రసాన్ని లోషన్ లాగా కూడా చర్మానికి రాసుకునేందుకు అవకాశం ఉంది అంటూ చెబుతున్నారు. ఇలా రెగ్యులర్ గా ద్రాక్ష తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం అంతకంతకూ పెరిగి పోతుంది అని.. ఆరోగ్యంగా కూడా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు.