ఇద్ద‌రు మంత్రుల‌ను ఢీకొట్టి గెలిచిన రోజా... ఇక తిరుగులేదా ?

VUYYURU SUBHASH
అధికార వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఇక తిరుగులేదులే.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రోజా.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే త‌న‌కు స్వ‌తంత్రం లేదంటూ.. పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రుల దూకుడుతో త‌న‌కు క‌నీసం.. ప్రొటో కాల్ కూడా అమ‌లు కావ‌డం లేద‌ని.. ఇటీవ‌ల అసెంబ్లీ హ‌క్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత .. రోజాను మ‌రింత‌గా తొక్కేస్తార‌నిఅంద‌రూ అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా.. ఇప్పుడు రోజా కు.. మాత్రం పెద్ద భ‌రోసా ల‌భించింద‌ని.. మంత్రులను సైతం ఆమె ఒంట‌రిగానే ఢీ కొట్టార‌ని అంటున్నారు సీనియ‌ర్లు.

దీనికి రీజ‌నేంటి? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. పంచాయతీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గ పరిధిలో రోజా మద్దతుదారుల హవా కొనసాగ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని అంటున్నారు. వాస్త‌వానికి ఇక్క‌డ మంత్రి పెద్దిరెడ్డి, నారాయ‌ణ స్వామి మ‌ద్ద‌తు దారులు రెబ‌ల్స్‌గా రంగంలోకి దిగారు. అయితే.. రోజా త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన వారు మాత్రం విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు మండలాల్లో ఉన్న‌ 87 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించారు. వీటిలో 22 పంచాయతీలు ఏకగ్రీవమ‌య్యాయి.  

దీంతో మిగిలిన పంచాయతీల్లో 64 మంది రోజా మద్ద తుదారులు విజ‌యం సాధించారు. మ‌రో 18 చోట్ల పంచాయ‌తీల్లో టీడీపీ మ‌ద్ద‌తు దారులు విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక నలుగురు మాత్ర‌మే పెద్దిరెడ్డి అనుచ‌రులు గెలుపొందారు. ముఖ్యంగారోజాకు గ‌ట్టి ప‌ట్టున్న వడమాలపేట మండలంలోని 14 పంచాయతీల్లో 12 స్థానాల్లో స‌ర్పంచ్ అభ్య‌ర్థులుగా రోజా మ‌ద్ద‌తు దారులే నిల‌బ‌డ్డారు. వీరంతా విజ‌యం సాధించ‌డం.. రోజాకు బూస్ట్ ఇచ్చిన‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీలకు లు. నగరి మండలంలో 16 స‌ర్పంచ్ స్థానాల‌ను రోజా మ‌ద్దతు దారులు విజ‌యం ద‌క్కించుకున్నారు.

పుత్తూరు మండలంలోనూ(మంత్రి నారాయ‌ణ స్వామికి ప‌ట్టున్న ప్రాంతం) రోజా మ‌ద్ద‌తు దారులు 12 స్థానాల‌ను కైవ‌సం చేసుకోవ‌డం రోజాకు.. మంచి ఊపు తెచ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై వైసీపీలోనూ చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, రోజాకు తిరుగులేద‌ని అంటున్నారు. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు రోజాకు ఎదురైన స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని అంటున్న‌రు ప‌రిశీల‌కులు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: