విజయ సాయి రెడ్డి పాద యాత్ర వెనక అంత కుట్ర ఉందా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ విడుదల చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైఎస్సార్సీపీ ఈ ప్రదర్శనను తలపెట్టింది. 2021, ఫిబ్రవరి 20వ తేదీ శనివారం ఉదయం 8గంటల 30నిమిషాలకు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పాదయాత్ర మొదలైంది. అక్కడి నుంచి అసీల్‌మెట్ట, సంగం జంక్షన్, కాళీ ఆలయం, తాటిచెట్ల పాలెం, కంచరపాలెం, ఊర్వశి జంక్షన్, 104 ఏరియా, మర్రిపాలెం, నావల్ అర్మామెంట్ డిపో జంక్షన్, విమానాశ్రయం, షీలా నగర్, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసెల్స్ లిమిటెడ్ , పాత గాజువాక, శ్రీనగర్ మీదుగా విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఆర్చి వరకు యాత్ర సాగనుంది.
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి పాల్గొననున్నారు. ఈ సభలో ఆ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి, విశాఖ జిల్లాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, భారీగా వైసీపీ కార్యకర్తలు పాల్గొననున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కాకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను తాము తీసుకుంటున్నామని, అవసరమైతే ఢిల్లీకి కార్మిక సంఘాల ప్రతినిధులను తీసుకెళ్తామని ఎంపి అన్నారు. ఈ విషయం పై ప్రధాని తో చర్చలు కూడా జరుపుతామని ఆయన అన్నారు..కానీ , ఈ విషయం పై టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా నే అతను ఇలా చేస్తున్నాడని విమర్శిస్తున్నారు.