అప్పుడు నాకే సొంతం అన్నాడు.. ఇప్పుడు అందరితో ఉండమన్నాడు..చివరికి

Satvika
మహిళలపై దాడులు జరగకుండా ప్రభుత్వం ఎన్ని కొత్త చట్టాలను అమలు చేస్తున్న కూడా వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా దోచుకుంటున్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. అయితే ఇటీవల ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు లోకి వచ్చింది. ఇప్పుడు జరిగిన ఘటన అమానుషం అని చెప్పాలి. సహజీవనం చేసి చివరికి వ్యభిచారం చేయాలని ఓ మృగాడూ అనడంతో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.అక్కడ కూడా న్యాయం జరగక పోవడంతో మీడియా ముందుకు వచ్చి తన గోడును వెళ్లబోసుకుంది..

వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన నిజామాబాద్‌ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఇదే గ్రామానికి చెందిన నందిని అనే మహిళకు 20 ఏళ్ల క్రితం నవీన్‌పేటకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా పెళ్లయిన ఆరేళ్లకే వీరికి విడాకులు అయ్యాయి. దీంతో ఆమె దేవునిపల్లి గ్రామంలో తన కొడుకుతో కలిసి నివాసం ఉంటుంది. కుటుంబ పోషణ కోసం జిల్లా కేంద్రంలోని ఓ ట్రావెల్స్ లో పని చేసేది.. భర్తకు దూరంగా ఉన్న కారణంతో అక్కడ యజమానికి దగ్గర అయ్యింది. అతనికి కావలసినవి తీర్చుకుంటూ, ఆమె అవసరాలను తీరుస్తూ వచ్చాడు.

యజమాని రమేష్‌తో పరిచయం సహజీవనానికి దారితీసింది. కరోనా కారణంగా ట్రావెల్స్‌ వ్యాపారం బాగా దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన రమేష్‌...నందినినీ వ్యభిచారం వ్యభిచారం చేసి డబ్బు సంపాదించాలని ఒత్తిడి చేశాడు. తాను చెప్పినదానికి ఒప్పుకోకపోతే తనను వేశ్యగా ప్రచారం చేస్తానని, అంతేకాకుండా చంపేస్తానని కూడా బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై రెండు నెలల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకుంది. దాంతో విసిగి పోయిన మహిళ మీడియా ముందుకు వచ్చింది. తనకు ఆతని నుంచి ప్రాణ హానీ ఉంది. నాకు న్యాయం చేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: