ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగితే క్యాన్సర్ వస్తుందంటా..!

N.ANJI
చాల మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు రోజుకు ఐదు సార్లు అయినా టీ తాగే అలవాటు ఉంటుంది కొందరికి. కానీ టీ తాగే అలవాటు తగ్గించుకుంటే ఆరోగ్యానికి మంచిది. అయితే టీ తాగేటప్పుడు చాల మంది ఏదోక్కటి తింటుంటారు. అయితే టీని తాగేటప్పుడు, అదే సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మరి ఆ పొరపాట్ల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.

చాలా వేడిగా చాయ్ తాగితే అలవాటున్నట్టైంతే వెంటనే దాన్ని మానుకోండి. త్రోట్ క్యాన్సర్ మాత్రమే కాదు ఎసిడిఫికేషన్, అల్సర్ వంటి కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తాయి. రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్లో టీ తాగితే అతి సూక్ష్మమైన 75,000 టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ ఒంట్లోకి చేరినట్టే. బయట టీ కోట్లో టీ తాగేవారు ఇది గుర్తుంచుకోండి. మంచి పోషకాలున్న డ్రై ఫ్రూట్స్, కూరగాయలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిదే. కానీ టీ తో పాటు వీటిని తీసుకుంటే మాత్రం అది విషంగా మారటం ఖాయం. చాలా మంది టీ తో పాటు బజ్జీలు, పకోడీలు, గారెలు వంటి చిరుతిళ్లు తింటారు.

అయితే సెనగపిండితో చేసిన ఇలాంటి వంటల తో పాటు చాయ్ తాగితే మీ ఒంట్లో పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు కడుపు నొప్పి, విరోచనాలు వంటి స్టమక్ అప్ సెట్ లు తలెత్తుతాయి. గుడ్లతో చేసిన ఆహారాన్ని తింటూ టీ తాగడం అస్సలు మంచిది కాదు. ఈ కాంబినేషన్ క్రమంగా కడుపు, జీర్ణవ్యవస్థ కు కోలుకులేని వ్యాధులకు గురిచేస్తుంది. మొలకలు వంటి వాటిలో ఐరన్, జింక్, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగాఉంటాయి. కానీ వీటిని  టీ తో కలిపి తీసుకున్నపుడు  హానికరంగా మారుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: