యానమలకే ఎసరా.. బాబోరు మరో వెన్నుపోటుకు రెడీ అయ్యారా..?
ఆనాడు ఎనమల రామకృష్ణుడు అలా చేయడం వల్ల చంద్రబాబు చేతికి పార్టీ దక్కడమే కాదు ముఖ్యమంత్రి పదవి దక్కడం ఇక ఆ తర్వాత చంద్రబాబు అంచెలంచెలుగా గొప్ప రాజకీయ నాయకుడిగా ప్రస్థానం కొనసాగించడం జరిగింది. కానీ మరి కొన్ని రోజుల్లో టిడిపి పార్టీ యనమల రామకృష్ణుడు పక్కన పెట్టేందుకు సిద్ధమవుతోందా అంటే అనే అవును సమాధానం వినిపిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. సాధారణంగా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడానికి టిడిపి పార్టీ అనుకూల మీడియా లో పలు కథనాలు ప్రచురిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా పార్టీ నుంచి ఎవరినైతే బయటికి పంపించాలి అని అనుకుంటారో వ్యూహాత్మకంగా ఇక ఆ పార్టీకి అనుకూల మీడియా ఒక రకమైన ఎటాక్ మొదలు పెడుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం టీడీపీ అనుకూల మీడియా యనమల రామకృష్ణుడి పై ఇలాంటి ప్రచారం చేయడం మొదలుపెడుతుంది. మరికొన్ని రోజుల్లో యనమల రామకృష్ణుడు జనసేన బీజేపీ పార్టీలో కి వెళ్ళిపోతున్నారూ అనేలా కథనాలు ప్రచురితం చేస్తున్నట్లు తెలుస్తోంది. యనమల పేరు పెట్టి కాకుండా.. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ బీసీ నాయకుడు జనసేన లేదా బీజేపీ లోకి వెళ్లిబోతున్నారని ప్రచారం చేస్తున్నాయి. అయితే తూర్పుగోదావరి లో బలమైన బీసీ నాయకుడు యనమల కావడం గమనార్హం. ఒకవేళ ఇదే నిజమైతే చంద్రబాబు మరో వెన్నుపోటు పొడిచినట్లే అవుతుందని అంటున్నారు.