రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. ఎక్కడెక్కడ అంటే..?

Chakravarthi Kalyan
ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి దశ పూర్తయింది. ఇప్పుడు రెండో దశ పోలింగ్‌ మొదలైంది. ఇవాళ ఉదయం 6.30 గంటలకు పోలింగ్ మొదలైంది. ఈ పోలింగ్ మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ వరకూ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. పోలింగ్ సరళిని క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు 2 వేల 606 మందిని  సూక్ష్మ పరిశీలకులను ఎస్‌ఈసీ నియామించింది. ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా  ఎస్ఈసీ, పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఇవాళ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో  18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 167 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2786 సర్పంచ్  స్థానాలకు , 20 817 వార్డు స్థానాలకు పోలింగ్ మొదలైంది.  సర్పంచ్ పదవికి 7507 అభ్యర్ధులు,వార్డు మెంబర్లకు 44,876 అభ్యర్థులు పోటీపడుతున్నారు. అసలు మొత్తం 3,328 పంచాయతీలు, 33570 వార్డులకు రెండో దశలోనోటిఫికేషన్ ఇచ్చారు. అయితే.. ఇప్పటికే ఏకగ్రీవమైన 539 పంచాయతీలు ,12,604 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అందుకే అక్కడ ఎన్నికలు లేవు.

ఏకగ్రీవంకాగా మిగిలిన పలు పంచాయతీలు, వార్డులకు ఇప్పుడు పోలింగ్ మొదలైంది. ఇక పోలింగ్ వివరాలు జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్లలో 10 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో 15 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. విశాఖపట్నం జిల్లాలో నర్సీపట్నం  రెవెన్యూ డివిజన్ లోన 10 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్ర వరం, రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ లలో 14 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 13 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో గుడివాడ రెవెన్యూ డివిజన్ లో 9 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావు పేట రెవెన్యూ డివిజన్ లో 11 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రకాశం జిల్లా లో ఒంగోలు, కందుకూరు రెవెన్యూ డివిజన్ లో 14 మండలాల్లో.. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో 10 మండలాల్లో.. కర్నూలు జిల్లాలో నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో  13 మండలాల్లో... అనంతపురం జిల్లాలో ధర్మవరం, కళ్యాణదుర్గం  రెవెన్యూ డివిజన్ లో 19 మండలాల్లో... కడప జిల్లాలో కడప రెవెన్యూ డివిజన్ లో 12 మండలాల్లో... చిత్తూరు జిల్లాలో మదన పల్లి రెవెన్యూ డివిజన్ లో 17 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: