బైడెన్ డిమాండ్.. నోరుమూసుకున్న చైనా..?
ఈ క్రమం లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ విమర్శలను తిప్పికొట్టేందుకు ఇక చైనా లో ఊహన్ నగరం లో కరోనా వైరస్ కు సంబంధించిన మూలాలను తెలుసుకునేందుకు పరిశోధకుల ను పంపించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పరిశోధకులను కూడా చైనా దేశంలోకి అనుమతించకపోవడం కూడా మొదట్లో చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇటీవలే ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పరిశోధకులు ఊహన్ నగరంలో పరిశోధనలు చేసేందుకు దేశంలోకి అనుమతిచ్చింది చైనా. అయితే ఇటీవలే చైనాలోని ఊహన్ నగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన పరిశోధకులు వెళ్లి పరిశోధనలు జరిపారు.
ఇక ఇటీవలే చైనాలో కరోనా వైరస్ ల్యాబ్ లో పుట్టింది కాదని జంతువుల ద్వారా వచ్చింది అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తల స్టేట్మెంట్ పై అమెరికా మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేసింది. చైనాలో ఊహన్ నగరం లో కరోనా మూలాలను తెలుసుకునేందుకు ఒక ప్రత్యేకమైన కమిటీని డిమాండ్ చేసింది అమెరికా. అయితే అమెరికా ఈ సరికొత్త డిమాండ్ తెరమీదికి తెచ్చినప్పటికీ చైనా మాత్రం సైలెంట్‌గా ఉండి పోవడం గమనార్హం.