వామ్మో.. అల్లం టీ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ఇవి మీకు తెలుసా..?

praveen
భారతదేశంలో ప్రతి ఒక్కరి జీవితంలో 'టీ' అనేది ఒక భాగం అయిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు ఇక ఏ సమయంలో అయినా టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సాధారణంగా అయితే ప్రతి ఒక్కరు పొద్దున్నే లేవగానే 'టీ' తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఆనందంగా ఉన్న  సమయంలో స్నేహితులతో 'టీ' లాగించేస్తారు. ఇక మరోవైపు ఒత్తిడిగా ఉన్న సమయంలో కూడా 'టీ' తాగి కాస్త ఉపశమనం పొందుతుంటారు. ఇలా సంతోషం వచ్చినా బాధ వచ్చినా..  ఒంటరిగా ఉన్న బంధువులతో ఉన్న 'టీ' తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు భారతీయులు.

 అందుకే ఇండియాలో ఎక్కడికి వెళ్లినా టీ చాలా ఫేమస్ ఉంటుంది. అంతే కాదు ప్రతి రోజు క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని అటు నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే 'టీ' లలో  కూడా వివిధ రకాల టీ లు ఉన్నాయి. అయితే ఎక్కువగా చాయి ప్రియులు తాగటానికి ఇష్టపడేది.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేది  అల్లం చాయ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అల్లం టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని క్రమం తప్పకుండా అల్లం టీ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు అంటూ నిపుణులు ఎప్పటి కప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు.

 అయితే అల్లం టీ  ద్వారా ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలుసు కానీ.. అల్లం టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. అయితే అల్లం టీ తరచు తాగితే మెదడు చురుగ్గా పని చేస్తుందట.  అంతేకాకుండా జలుబు తలనొప్పి లాంటివి కూడా తగ్గుతాయట. ఇక మధుమేహం లాంటి వ్యాధులను కూడా అల్లం టీ  నియంత్రిస్తుందట. రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడటంతో పాటు.. ఎలర్జీలు తగ్గించడమే కాదు నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుందట. క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంతో పాటు జీర్ణక్రియను కూడా క్రమక్రమంగా మెరుగుపరుస్తుందట అల్లం టీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: