అదృష్టం అంటే ఇదే మరి.. పెళ్లికి వెళ్లి కోటీశ్వరుడయ్యాడు..?

praveen
కొన్ని కొన్ని సార్లు ఊహించని విధంగా అదృష్టం వరించి  కొంతమంది కోటీశ్వరులు గా మారిపోయే ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే..  ఇక్కడ ఓ వ్యక్తి విషయంలో ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతను నక్క తోక తొక్కాడురా  అందుకే అదృష్టం కలిసి వచ్చింది అనే సామెత  ఇతని  విషయంలో సరిగ్గా సరిపోతుంది. ఏకంగా 48 లక్షల మందిలో  అదృష్టవంతుడు గా నిలిచాడు ఇక్కడ ఒక వ్యక్తి.  వంద రూపాయలు ఖర్చుపెట్టి ఏకంగా కోటీశ్వరుడు గా మారిపోయాడు. ఈ విషయాన్ని ఇక అతను కూడా నమ్మలేక పోయాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 కర్ణాటకలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  కర్ణాటక మాండ్య జిల్లాలోని మద్దూర్ పరిధిలో బొమ్మనహళ్లి గ్రామానికి చెందిన సోహన్ బలరాం అనే యువకుడు ఫిబ్రవరి 5వ తారీఖున కేరళ వెళ్లాడు. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో పెళ్ళికి హాజరయ్యాడు. అయితే ఇదే పెళ్ళి తంతు పూర్తి అయిన తర్వాత దేవదాసు ప్రభాకర్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు సోహన్. అతని  దుకాణంలో కేరళ భాగ్య మిత్ర లాటరీ టికెట్ లను సోహన్ చూశాడు. ఇక ఇదేంటని స్నేహితుడిని అడిగితే..  కోటి రూపాయల లాటరీ టికెట్ అని చెప్పడంతో.. సోహన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వంద రూపాయలు పెట్టి ఒక లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడు.



 ఇక ఆ తర్వాత కేరళలో అన్ని రకాల వ్యవహారాలు పూర్తి చేసుకున్న తర్వాత మధ్యాహ్నం సమయంలో తిరిగి స్వగ్రామానికి వచ్చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడి నుండి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేయగానే కంగ్రాట్స్ నువ్వు కోటి రూపాయలు గెలుచుకున్నవు  అంటూ స్నేహితుడు కాల్ చేసాడు. అయినప్పటికీ అతను మాత్రం నమ్మలేదు. ఇక ఆ తరువాత లాటరీ  వివరాలు తెలుసుకొని అవాక్కయ్యాడు. ఆ లాటరీ 48 లక్షల మంది ఉంటే కేవలం ఐదుగురికి మాత్రమే కోటీశ్వరుడయ్యాడు ఛాన్స్ దక్కడం.. అందులో సోహన్ ఉండడంతో ఆనందంలో మునిగిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: