
జగడ్డ : కర్నూలులో కనికరించని ప్రజలు.. అక్కడ జగన్ పార్టీకి ఊహించని షాక్..?
అయితే వైసిపి పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తుంది అని అటు ప్రతిపక్ష టిడిపి పార్టీ ఎన్నో ఆరోపణలు చేసింది. ఇకపోతే వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని పంచాయతీల్లో మాత్రం వైసీపీకి ఊహించని షాక్ తగిలింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే సాయంత్రం సమయంలో ఫలితాలు కూడా విడుదలయ్యాయి అన్న విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు భారీ విజయం సాధించినప్పటికీ కొన్ని పంచాయతీలలో మాత్రం వైసీపీ ఆటలు సాగలేదు వ్యూహాలు ఫలించలేదు అని చెప్పాలి.
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఎన్నికల్లో ఇటీవల జరిగిన మొదటి విడత పోలింగ్ లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏకంగా 233 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో జగన్ పార్టీ కి భారీ షాక్ తగిలింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలమైన గ్రామ పంచాయతీగా ఉన్న వెంకటాపురం లో టిడిపి విజయం సాధించడం తో ప్రస్తుతం టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయా గ్రామ పంచాయతీలలో వైసీపీ మద్దతుదారులు ఎంతగా ప్రచారం జరిగినప్పటికీ ప్రజలు మాత్రం టిడిపి వైపు ఎక్కువగా మొగ్గు చూపారు.