జగడ్డ: అనంతలో ఆ టీడీపీ నేత మృతికి పోలీసులే కారణం...?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ఎట్టకేలకు మొదటి విడుత ఎన్నికలు ఈరోజు మొదలయ్యాయి. ప్రకటించిన అన్ని జిల్లాల్లో నిన్ననే పోలింగుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగు జరుగుతున్న కొన్ని ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించడంతో అక్కడ భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈరోజు ఉద్యాన 6.30 గంటల నుండి పోలింగు ప్రారంభం అయింది. ఈ పోలింగు మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనుంది. అంనంతపురం జిల్లాలోని 12 మండలాలలో 163 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో మొత్తం అభ్యర్థులు 462 మంది పోటీ పడుతున్నారు. పోలింగు సిబ్బంది, ఇటు పోలీసు సిబ్బంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి నుండే అభ్యర్థులకు గెలుపు ఓటముల గురించి ఆలోచన మొదలైంది. ఇదంతా ఇలా ఉండగా ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటినుండి అనంతపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో వైసీపీ నాయకుల బెడద ఎక్కువైంది. అధికారం చేతిలో ఉంది కదా అని వారి పరిధి మేరకు అభ్యర్థులను బెదిరించడం, అలాగే ప్రత్యక్షంగా మీ కాళ్ళు నరికేస్తాము చేతులు తీసేస్తాము అంటూ బెదిరింపు ధోరణికి దిగడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపై పలు కేసులు కూడా సదరు అభ్యర్థులు పెట్టడం జరిగింది. కొన్ని కేసులు అయితే ప్రతిపక్ష పార్టీలే చొరవ తీసుకుని పోలీసులకు చెప్పడం జరిగింది.

ప్రస్తుతం అనంతపురం రూరల్ మండలానికి చెందిన టీడీపీ అభ్యర్థి భర్త ఆదినారాయణ అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. మొదటి విడతగా రూరల్ పంచాయితీలో వార్డ్ మెంబర్ గా ఆదినారాయణ భార్య సావిత్రమ్మ నామినేషన్ వేయడం జరిగింది. అప్పటి నుండి ఆమెకు మరియు ఆమె భర్తకు వైసీపీ కార్యకర్తల నుండి బెదిరింపులు మొదలయ్యాయి. అంతే కాకుండా అక్కడి పోలీసుల నుండి కూడా బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది. ఆదినారాయణ కుటుంబ సభ్యులు పోలీసులు మరియు రాజకీయ నాయకుల ఒత్తిడి వల్లే ఆదినారాయణ మృతి చెందాడంటూ ఆవేదన చెందుతున్నారు. మరి దీనిపై అటు ఎన్నికల సంఘం మరియు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: