వైసీపీ సర్పంచ్ క్యాండెట్‌ను వైసీపీయే కిడ్నాప్ చేసిందే.. అదే అసలు ట్విస్ట్ ?
కళ్యాణదుర్గం మండలం ఎం. కొండాపురం గ్రామానికి చెందిన వైసీపీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీదేవి తాను నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆ పంచాయతీలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి త్రివేణి ఏకగ్రీవం అయినట్లు ప్రచారం జోరుగా సాగింది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ స్థానిక నాయకులు ఆ గ్రామానికి వెళ్ళి లక్ష్మీ దేవి భర్త నరసింహుల ను బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు ఆయన తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ పరిణామం తెలుగుదేశం పార్టీలోనూ... అటు వైసీపీ లోనూ తీవ్ర కలకలం రేపింది. సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్ అన్న ప్రచారం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఈ విషయంపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు మాట్లాడుతూ తమ పార్టీకి సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతుంటే వైసీపీ వాళ్లు దారుణాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అధికారులు నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. ఏదేమైనా ఈ కిడ్నాప్ వ్యవహారం ఇప్పుడు స్థానిక ఎన్నికల వేళ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.