తొలి విడత ఏకగ్రీవాల్లో జగన్‌కు కడపలో షాక్... పెద్దిరెడ్డి ట్విస్ట్ ..!
ఇక శ్రీకాకుళం జిల్లాలో 321 పంచాయతీలకు 34 , విశాఖ జిల్లాలో 340 పంచాయతీలకు 32, తూర్పు గోదావరి జిల్లాలో 366 పంచాయతీలకు 28, కృష్ణా జిల్లాలో 234 పంచాయతీలకు 20, ప్రకాశం జిల్లాలో 229 పంచాయతీలకు 16 ఏకగ్రీవం అయ్యాయి. నెల్లూరు జిల్లాలో 163 పంచాయతీలకు 14 ఏకగ్రీవం కాగా, అనంతపురం జిల్లాలో 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం అయ్యాయి.
జగన్‌ను మించిన పెద్దిరెడ్డి ?
తొలివిడత ఏకగ్రీవాల విషయంలో సీఎం జగన్ సొంత జిల్లా కడప కంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాథినిత్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లాలోనే ఎక్కువ ఏకగ్రీవాలు అయ్యాయి. కడప జిల్లాలో 46 ఏకగ్రీవాలు అయితే.. చిత్తూరు జిల్లాలో ఏకంగా 96 ఏకగ్రీవాలు అయ్యాయి. వాస్తవానికి కడప జిల్లాలో దాదాపు 50 శాతం ఏకగ్రీవాలు ఉంటాయని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. అయితే అక్కడ టీడీపీ అభ్యర్థులు పల్లె పోరులో ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఏకగ్రీవాలు తక్కువ నమోదు అవుతున్నాయి.