ఇండియా బడ్జెట్ చూసి.. చైనా ఫుల్ ఖుషీ ఖుషీ.. ఎందుకంటే..?
ఎందుకంటే.. ఓవైపు లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణ కొనసాగుతోంది. దీంతో బలగాల మోహరింపులో ఎక్కడా వెనక్కితగ్గే పరిస్థితిలేదు. తాజాగా ఉత్తర సిక్కింలోని నాకులా వద్ద మరో ఘర్షణ చోటుచేసుకొంది. సైన్యాన్ని అన్నిరంగాల్లో ఆధునీకరించి చైనాను కట్టడి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. లేకపోతే భూభాగం కోల్పోక తప్పని పరిస్థితి వస్తుంది. మరి అలాంటి చైనాతో యుద్ధం పరిస్థితులు వస్తే.. ఇండియా ఏంచేయాలి.. అందు కోసం ఎంత ఖర్చు పెట్టాలి.. మరి అంత ఖర్చు చేస్తే అవకాశం బడ్జెట్ కల్పిస్తుందా.. ? అన్న సందేహాలు నిన్నటి వరకూ ఉండేవి.
కానీ.. ఇండియా ఈ సారి తన బడ్జెట్‌లో రక్షణ రంగానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యం ఇచ్చింది. రక్షణ రంగానికి ప్రాధాన్యం బాగా తగ్గింది. నామమాత్రపు కేటాయింపులే ఉన్నాయి. చైనాతో పోల్చుకుంటే భారత్ ఆర్థికవ్యవస్థ ఐదింట ఒకటో వంతు ఉంటుంది. సాధారణంగా చైనా రక్షణ బడ్జెట్‌తో పోలిస్తే మూడింట ఒకటోవంతు మాత్రమే భారత్ కేటాయింపులు ఉంటాయి. అయితే ఈసారి రక్షణ బడ్జెట్‌పై చైనాతో ఘర్షణ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఆశించినా.. అలాంటిదేమీ లేదు.
ఇండియాకు సంబంధించిన దారుణమైన విషయం ఏంటంటే.. ఏడేళ్ల నుంచి సైన్యం అవసరాలు కేటాయింపుల మధ్య 14శాతం నుంచి 30 శాతం వరకు లోటు ఉంటోంది. అదే చైనా పరిస్థితి చూస్తే.. 2019లో 175 బిలియన్ డాలర్లు వెచ్చించించిదట. ఇది పైకి చెప్పిన లెక్కలు మాత్రమే.. కానీ ఆ మొత్తం 240 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి అలాంటి చైనాను కట్టడి చేయాలంటే.. భారత్ కూడా రక్షణ కేటాయింపులు పెంచుతారని ఆశించారు. కానీ.. ఈసారి రక్షణ రంగానికి నిరాశే మిగిలింది. అందుకే చైనా ఖుషీ అవుతోందట.