తలకు రాసుకునే నూనె తాగిన మహిళ.. చివరికి ప్రాణం పోయింది..?
తలకు రాసుకునే నూనె తాగి ఓ మహిళ మృతి చెందడం తో కుటుంబం మొత్తం విషాదంలో మునిగి పోయింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట రింగు బస్తీలో యాదయ్య, భాగ్య అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే కొంతకాలం వరకు అంత సాఫీగా సాగిపోయినప్పటికీ.. కొన్ని రోజుల నుంచి భార్య భాగ్య మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తుంది. ఇక వైద్యులకు చూపించి నప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
అయితే ఈ నెల 27వ తేదీన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో.. భార్య భాగ్య తలకు రాసుకునే నూనె తాగింది. ఇక నిమిషాల వ్యవధిలోనే వాంతులు చేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇక ఇటీవల చికిత్స పొందుతూ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలికి మతి స్థిమితం లేకపోవడం కారణంగా ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నిండిపోగా స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.