సీజనల్ వ్యాధుల పై జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు.. వార్ షురూ..

Satvika
సీజన్ మారింది అంటే రోగాలు కూడా వస్తుంటాయి.. పల్లెల్లో కన్నా కూడా పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా రోగాల తో బాధపడతారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. నగర ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ముందుకు వెళ్తున్నది. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నది. డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా మొదలగు వ్యాధులు ప్రజల దరి చేరకుండా చర్యలు తీసుకుంటున్నది. అధికారుల చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యమూ అవసరమేనంటూ అవగాహన కల్పిస్తున్నది.



గతేడాది రూపొందించిన ప్రణాళికలు సత్ఫలితాలివ్వటం తో అదే స్ఫూర్తితో దూకుడు పెంచింది. ఈ ఏడాది సీజనల్ వ్యాధుల నివారణకు రంగం సిద్ధం చేస్తోంది. ఆరోగ్య హైదరాబాద్‌ లక్ష్యంగా సీజనల్‌ వ్యాధుల పై జీహెచ్‌ఎంసీ యుద్ధం ప్రకటించింది. డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా వంటి వ్యాధుల నియంత్రణకు యంత్రాంగం వార్షిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నది. నెల వారీగా చేపట్టే పనులకు తగ్గట్టుగా ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ సిద్ధం చేసుకొని అధికారులు క్షేత్ర స్థాయిలో చర్యలను వేగవంతం చేశారు.
 


ఈ సందర్బంగా "ఆపరేషన్‌ దోమ" పేరిట ప్రతి వారం యాంటీ లార్వా కార్యక్రమం చేపట్టనున్నారు. ఇంటింటికీ ఫాగింగ్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పేరిట పారిశుధ్యం పై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టడంతో పాటు పాఠశాలలు, దవాఖానాలు, కాలేజీలు, ఇంటి పరిసరాల శుభ్రతపై విస్తృత అవగాహన కల్పించనున్నారు. గత ఏడాది దోమల నివారణ వాటి నుంచి వచ్చే వ్యాధులను చాలా వరకు అరికట్టినట్లు అధికారులు వెల్లడించారు. స్వీయ జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి జబ్బులు దరి చేరవు.. ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన చెత్త ఏరివేత, నీరు నిలిచే ప్రాంతాల్లో పేరుకుపోయిన ఇసుక, ఇతర వ్యర్థాల తొలగింపు, నాలాల్లో పూడికతీత పనులు, భవన నిర్మాణ వ్యర్థాలను తరలించడం, ప్రజలు కూడా అధికారులకు సహకరిస్తూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: