ఆ ఇంటలిజెన్స్ రిపోర్టు చూసి కేసీఆర్ షాక్.. అందుకే హఠాత్తుగా ఆ నిర్ణయం..!?
అదేంటంటే.. తెలంగాణ సర్కారు కూడా అగ్రవర్ణాల పేదలకు రిజర్వేష్లు అమలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్ల కోటా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు. రెండుమూడు రోజుల్లోనే ఈ విషయంపై కేసీఆర్ దీనిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, ఆదేశాలు జారీ చేస్తారట. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు కేసీఆర్.
అయితే హఠాత్తుగా కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ సీరియస్ కారణం ఉందట. అదేంటంటే.. ఇటీవల కేసీఆర్ వద్దకు ఓ ఇంటలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందట. అదేమిటంటే.. బీజేపీ త్వరలోనే అగ్రవర్ణ పేదల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతోందట. ఇప్పుటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పుంజుకున్న బీజేపీ ఈ ఉద్యమంతో మరింత లాభపడుతుందని ఆ రిపోర్టు చెప్పిందట. అందుకే కేసీఆర్ హఠాత్తుగా తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారట.
ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. భాజపా పోరాటానికి సిద్దమవుతుందని ఇంటలిజెన్స్ నివేదికతోనే కేసీఆర్ హాఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు బండి సంజయ్. అందుకే నిన్న మొన్న తప్పు అన్న రిజర్వేషన్లు ఇప్పుడు కేసీఆర్‌కు ఒప్పు అయ్యాయని అంటున్నారు. కేసీఆర్ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. లేకుంటే మెడలు వంచైనా అమలు చేయిస్తామన్నారు బండి సంజయ్.