అదృష్టం అంటే ఇతనిదే.. 12 కోట్లు గెలుచుకున్నాడు..?

praveen
సాధారణంగా డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు.. కానీ నేటి రోజుల్లో డబ్బులు సంపాదించడం.. ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు గా మారడం అనేది  కేవలం కలలో మాటే  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ కొంతమందికి మాత్రం అదృష్టం బాగా కలిసి వచ్చి చివరికి ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అవుతున్న ఘటనలు కూడా ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇదంతా ఉద్యోగమో వ్యాపారమో చేయడం వల్ల సాధ్యం కావడం లేదు.. దీన స్థితిలో ఉన్న ఎంతోమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరి టిక్కెట్ కొనుగోలు చేయడమే దీనికంతటికీ కారణం.



 ఎంతోమంది ఏదో లాటరీ టికెట్ కొనుగోలు చేయడం ఇక అదృష్టం బాగా వరించి లాటరీ రావడం లాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా భారత్ నుంచి విదేశాలలో స్థిరపడిన వారికి ఎంతో మంది లాటరి టికెట్ గెలుచుకొని కోటీశ్వరులు  గా మారుతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేరళ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లిన వారిలో చాలా మంది లాటరి టికెట్ గెలుచుకున్నారు ఈ మధ్యకాలంలో. ఇటీవలే మరో వ్యక్తి కూడా గెలుచుకున్నాడు.



 కేరళకు చెందిన షర్ఫుద్దీన్ అనే వ్యక్తి లాటరీ టికెట్లు అమ్ముతూ బ్రతుకు బండిని నడిపే వాడు. ఆరు కుటుంబ సభ్యులతో ఉన్న ఆ కుటుంబం లాటరీ టికెట్లు అమ్మితే నాలుగు వేళ్లు  నోట్లోకి  వెళ్ళేవి. ఈ క్రమంలోనే ఎంతో ఇబ్బందులు పడుతూ లాటరీ టికెట్లు అమ్ముతూ చివరికి కుటుంబాన్ని పోషించేవాడు సదరు వ్యక్తి. అయితే ఇటీవలే లాటరీ టికెట్ల అమ్మకం లో భాగంగా కొన్ని టికెట్లు అమ్ముడు పోకపోవడంతో అతని దగ్గరే ఉండి పోయాయి. అయితే లాటరీ టికెట్లు అమ్ముడు పోకపోవడంతో అతడు ఎంతో నిరాశ చెందుతాడు. కానీ అదే అతనిని  కోటీశ్వరుడు గా మారుస్తుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. అతని దగ్గర ఉన్న ఒక టికెట్ కోట్ల రూపాయలు గెలుచుకుంది. 12 కోట్ల ప్రైజ్ మనీ తో ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: