కేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ జాతీయ వార్తా చానెల్ ‘ఏబీపీ న్యూస్’ చేసిన ‘దేశ్ కా మూడ్’ సర్వేలో బెస్ట్ సీఎంలలో ఏపీ సీఎం మూడో స్థానాన్ని సాధించారు. తొలి రెండు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ ఘనత సాధించారు.
అయితే ఈ జాబితాలో కేసీఆర్ పేరు ఎక్కడా కనిపించలేదు. నవీన్ పట్నాయక్ – ఒడిశా, అరవింద్ కేజ్రీవాల్ – ఢిల్లీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్, పినరయి విజయన్ – కేరళ, ఉద్ధవ్ ఠాక్రే – మహారాష్ట్ర, భూపేశ్ బఘేల్ – ఛత్తీస్‌గఢ్, మమతా బెనర్జీ – పశ్చిమ బెంగాల్, శివరాజ్ సింగ్ చౌహాన్ – మధ్య ప్రదేశ్, ప్రమోద్ సావంత్ – గోవా, విజయ్ రూపానీ – గుజరాత్.. ఇదీ టాపర్స్ జాబితా.
మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కారు మాత్రం ఈ సర్వేలో టాప్ టెన్‌లో స్థానం దక్కించుకోలేకపోయింది. అయితే ఈ సర్వే ప్రమాణికత ఎంత అంటారా.. అదెలా చెప్పగలం లెండి.. గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి జాతీయ సర్వేల్లో ఏకంగా ఫస్ట్ ప్లేస్ కూడా సంపాదించుకున్నారు. ఏదేమైనా కేసీఆర్ టాప్ టెన్ లో కూడా లేకపోవడం.. జగన్ మూడో ప్లేస్ సాధించడం ఆసక్తికరమే కదా.