ఏపీ సీఎం బెస్ట్... మరి తెలంగాణ సీఎం....!?

Shirisha
దేశంలో బెస్ట్ సీఎంలు ఎవ‌రు, వ‌ర‌స్ట్ సీఎంలు ఎవ‌రు అంటూ ప్ర‌ముఖ  ఏబీపీ-సీ ఓట‌ర్ సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది.దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మూడో స్థానంలో ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. దేశ్ కా మూడ్ పేరిట ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అన్ని దేశాల ముఖ్యమంత్రులపై చేసిన సర్వేలో.. బెస్ట్ సీఎంల జాబితాలో జగన్ నిలిచారు .కరోనా సంక్షోభాన్ని దేశం ఎలా ఎదుర్కొంది? ప్రధాని మోదీ పాలన తీరు ఎలా ఉంది? ముఖ్యమంత్రుల పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై ఈ సర్వే జరిగింది.
అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఈ ఘనత సాధించారు. ఈ ఏబీపీ న్యూస్‌ సర్వేలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్లో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 8వ స్థానంలో, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ 9వ స్థానంలో, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ 10వ స్థానంలో నిలిచారు. ఏబీపీ–సీఓటర్‌ సంస్థ దేశ్‌ కా మూడ్‌ పేరుతో దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాల్లో గత 12 వారాల్లో 30 వేలకు పైగా ప్రజలను అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా సర్వేను రూపొందించింది.  ...
ఈ జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచారు. దేశంలో అత్యంత వ‌ర‌స్ట్ సీఎంగా ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ పేరు ఉండ‌గా, రెండోస్థానంలో హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్, మూడో స్థానంలో పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్, నాలుగో స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఐదో స్థానంలో త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి వున్నారు
ఏబీపీ-సీ సర్వ్ ప్రకారం బెస్ట్‌ సీఎంలు :
1) నవీన్‌ పట్నాయక్‌ – ఒడిశా
2) అరవింద్‌ కేజ్రీవాల్‌ – ఢిల్లీ
3) వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి – ఆంధ్రప్రదేశ్‌
4) పినరయి విజయన్‌ – కేరళ
5) ఉద్ధవ్‌ ఠాక్రే – మహారాష్ట్ర
6) భూపేశ్‌ బఘేల్‌ – ఛత్తీస్‌గఢ్‌
7) మమతా బెనర్జీ – పశ్చిమబెంగాల్‌
8) శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ – మధ్య ప్రదేశ్‌
9) ప్రమోద్‌ సావంత్‌ – గోవా
10) విజయ్‌ రూపానీ – గుజరాత్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: