షాకింగ్: నిమ్మగడ్డపై జగన్ గెలుపు ఒక్క పూటేనా..?
ఈ తీర్పుతో వైసీపీ శ్రేణులు ఆనందంతో మునిగిపోయాయి.. ఎందుకంటే ఇంకా నిమ్మగడ్డకు 2 నెలల పదవీ కాలం మాత్రమే ఉంది. ఈ లోపు వ్యాక్సీన్లు ఎలాగూ అందరికీ రావు.. కాబట్టి ఇక నిమ్మగడ్డ రిటైర్ అయిన తర్వాతే ఎన్నికలు జరుగుతాయన్న ఆనందం వైసీపీ నేతల్లో ఉంది. అందుకే అంతా ఈ తీర్పుపై ఆనందంగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంకో విషయం ఉంది. ఈ తీర్పు ఇచ్చింది సింగిల్ బెంచ్ న్యాయమూర్తి.
అందుకే నిమ్మగడ్డ ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీలుకు దాఖలు చేసుకున్నారు. హైకోర్టు దాన్ని కూడా విచారణకు స్వీకరించింది. దీనిపై ఇవాళ.. హైకోర్టులో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం తీర్పు ఇచ్చింది సింగిల్ జడ్జి కాబట్టి అనూహ్యంగా జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. మరి రేపు ఏ బెంచ్ ముందుకు వెళ్తుందో.. అందులో ఎవరు ఉంటారో.. తీర్పు ఎలా వస్తుందో చెప్పలేం.. ఎందుకంటే చాలా మంది హైకోర్టు న్యాయ మూర్తులు చంద్రబాబు ఆడించినట్టే ఆడుతున్నారని వైసీపీ నేతలే చాలాసార్లు చెప్పారు.
మరి వారి ఆరోపణలే నిజమవుతాయా.. నిమ్మగడ్డకు అనుకూలంగా డివిజన్ బెంచ్ తీర్పు వస్తుందా.. చెప్పలేం.. మరి నిమ్మగడ్డపై జగన్ గెలుపు ఈ ఒక్క పూటేనా.. లేక.. ఆయన రిటైర్ అయ్యేవరకా అన్నది డివిజన్ బెంచ్ తేలుస్తుంది.. చూడాలి ఏం జరు గుతుందో..?