బాల‌య్య దూకుడు అల్లుడు లోకేష్‌కు షాక్ ఇచ్చిందిగా... !

VUYYURU SUBHASH
రాష్ట్ర టీడీపీలో ఇప్పుడు ఇదే విష‌యంపై జోరుగా చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వియ్యంకుడు, హిందూపురం నుంచి వ‌రుస‌గా రెండో సారి కూడా విజ‌యం ద‌క్కించుకుని రికార్డు సృష్టించిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య స్ట‌యిలే వేరు. గ‌తంలో పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. ఇప్పుడు.. కూడా ఆయ‌న శైలిలో ఎక్క‌డా తేడా లేదు. అయితే.. ఇప్పుడు పార్టీ అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా దెబ్బ‌తిన్న త‌ర్వాత‌.. పార్టిని ప‌రుగులు పెట్టించేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా ఫ‌లించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే పార్టీలో కీల‌క ప‌ద‌వులు సృష్టించి మ‌రీ భ‌ర్తీ చేశారు. యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయినా.. కూడా ఎక్క‌డో ఒకింత నైరాశ్యం వెంటాడుతూనే ఉంది.
ఈ క్ర‌మంలో  పార్టీలో ఊపు తెచ్చేందుకు, దూకుడుగా ముందుకు సాగేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తే బాగుంటుంద‌నే భావ‌న పార్టీ సీనియ‌ర్ల‌లో వ్య‌క్త‌మవుతోంది. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య అరంగేట్రంతో సీనియ‌ర్లు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. గ‌తానికి భిన్నం గా ఆయ‌న స్పందిస్తార‌ని అనుకున్నారు. అదేస‌మ‌యంలో పార్టీని కూడా ముందుకు న‌డిపించేందుకు ప్ర‌య‌త్నిస్తార‌ని అనుకున్నా రు. వారు అనుకున్న‌ట్టుగానే బాల‌య్య దూకుడు చూపించారు. రెండు రోజుల పాటు హిందూపురంలో ప‌ర్య‌టించారు. అంతేకాదు.. ప్ర‌భుత్వంపై దూకుడుగా కామెంట్లు కుమ్మ‌రించారు.
అవ‌స‌ర‌మైతే.. సీఎం జ‌గ‌న్‌ను సైతంతాను క‌లుస్తాన‌ని.. రైతుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చిస్తాన‌ని చెప్ప‌డం వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. పార్టీప రంగా బాల‌య్య ఏం చేశార‌నేది కీల‌క ప్ర‌శ్న‌గా మారింది. యూత్‌ను క‌ద‌లించ‌డంలో బాల‌య్య దూకుడు స‌రిపోలేదు. పైగా అనంత‌పురంలోనే చాలా మంది యువ నాయ‌కులు ఉన్నా.. బాల‌య్య ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. జేసీ కుటుంబం పూర్తిగా బాల‌య్య ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉంది. అదేవిధం గా ప‌రిటాల ఫ్యామిలీ కూడా అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించింది. ఈ నేప‌థ్యంలో  బాల‌య్య వ‌చ్చాడు-వెళ్లాడు.. అనే కామెంట్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
ఈ ప‌రిణామాల‌తో పార్టీలో సీనియ‌ర్లు ఆశించినంత దూకుడు అయితే.. బాల‌య్య తీసుకురాలేక పోయార‌నేది వాస్త‌వం. కానీ, కొంత ఉత్సాహ‌మైతే.. వ‌చ్చింది. అయితే అల్లుడు లోకేష్ క‌న్నా మామ బాల‌య్యే పంచ్‌లు పేల్చాడ‌న్న‌ది కూడా పార్టీ వ‌ర్గాల టాక్ ?  నంద‌మూరి ఫ్యామిలీ ఇటీవ‌ల కాలంలో పార్టీకి చేరువ అయితే.. బాగుంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో బాల‌య్య రావ‌డం, గుడివాడ ఎమ్మెల్యే క‌మ్ మంత్రి కొడాలి నానిపైనా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: