శ్రీవారిని దర్శించుకున్నారు.. కానీ అంతలోనే నలుగురి ప్రాణాలు పోయాయి..?
కొన్ని కొన్ని సార్లు విధి చిన్నచూపు చూడటం తో వాహనదారులు సరైన మార్గంలోనే వెళ్లినప్పటికీ ఇతరులు చేసిన పొరపాటుతో రోడ్డు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సినా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఇటీవల ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్టూరు జాతీయ రహదారి వద్ద ఈ ఘటన జరిగింది. లారీ వెనుక నుంచికారు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మృతులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు.
అయితే అందరూ కూడా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు తిరుపతి వెళ్లి అక్కడ శ్రీవారిని దర్శించుకుని ఇక ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో దేవుడి దర్శనం దొరికింది అని ఆనంద పడుతున్న వారిని అంతలోనే విధి చిన్న చూపు చూసి రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా నలుగురు మృతి చెందారు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.