కస్టమర్లకు ఎస్బిఐ వార్నింగ్.. అలా చేశారో ఖాతా ఖాళీ అవుతుంది అంటూ..?

praveen
ప్రస్తుతం దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందిస్తుంది. ప్రస్తుతం అత్యధిక కస్టమర్లు కలిగిన బ్యాంకుగా కూడా బ్యాంకింగ్ రంగంలో దిగ్గజ బ్యాంకు గా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.ఇప్పటికే తమ కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తుంది అన్న విషయం తెలిసిందే.  ఇకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ  విషయంలో  తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.



 ఇక ఇటీవలే మరోసారి స్టేట్ బ్యాంక్ కస్టమర్లు  అందరిని ఎస్బిఐ హెచ్చరించింది.  మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలి అంటూ అందరినీ అప్రమత్తం చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. మోసగాళ్లు సోషల్ మీడియా వేదికగా మోసపూరిత మెసేజ్లు పంపిస్తూ.. డబ్బులు దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారని ఇలాంటి మోసపూరిత మెసేజ్లతో జాగ్రత్తగా ఉండాలని. ఉచ్చులో పడి మోసపోవద్దు అంటూ హెచ్చరిస్తోంది. కస్టమర్లందరూ సోషల్ మీడియా లో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం.



 ఈ మధ్య కాలంలో ఫేక్ మెసేజ్ లు ఎక్కువగా వస్తున్నాయి ఫేక్ మెసేజ్ ల బారిన పడకుండా ఉండండి.. తప్పుదోవ పట్టించే మెసేజ్లతో ఎంతో అప్రమత్తంగా ఉండండి. లేకపోతే అకౌంట్ ఖాళీ అయిపోవచ్చు. అందుకే కస్టమర్లు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ సోషల్ మీడియా ఖాతాలో  తమ కస్టమర్లను హెచ్చరించింది. అయితే ఇలా తమ కస్టమర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించడం ఇది మొదటిసారి కాదు అని చెప్పాలి. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపథ్యంలో ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించడంతో పాటు..  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: