భారత్ లోకి వ్యాక్సిన్ వచ్చినందుకు.. వాళ్ళు ఏడుస్తున్నారు..?

praveen
ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కరోనా  వైరస్ పట్టిపీడిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న వైరస్ ను  అంతం చేసేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడమే కాదు శరవేగంగా క్లినికల్ ట్రయల్స్  కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు దేశాలలో వ్యాక్సిన్  అత్యవసర వినియోగం కోసం అనుమతి కూడా పొందడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక ఇటీవలే భారత్ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం రెండు రకాల వ్యాక్సిన్ ల  కు అనుమతి ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.


 అయితే శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలైందని ప్రస్తుతం  అందరూ ఎంతో సంతోషపడుతున్నారు. కానీ  ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు వ్యాక్సిన్ విషయంలో కూడా రాజకీయాలు చేస్తూ ఉండటం దురదృష్టకరం. ఇటీవలె అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్లు బిజెపి వ్యాక్సిన్ అంటూ వ్యాఖ్యానించడం.. ఇక మరికొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడంవల్ల నపుంసకత్వం వస్తుంది అని తప్పుడు ప్రచారాలు చేయడం లాంటివి చేశారు. అటు కాంగ్రెస్ కూడా ప్రస్తుతం వ్యాక్సిన్ పై విమర్శలు గుప్పిస్తోంది. జైరామ్ రమేష్, శశి ధరూర్, ఆనంద్ శర్మ లాంటి కాంగ్రెస్ నేతలు.. మూడో విడత క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు రాకముందే డీసిజిఐ అసలు ఎలా వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చింది.



 మూడో విడత ఫలితాలు రాకముందే వ్యాక్సిన్ వినియోగానికి ఎలా అనుమతి ఇస్తారు దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వివరణ ఇవ్వాలి అంటూ విమర్శలు గుప్పించారు.  నిపుణుల కమిటీ సూచనమేరకు అనుమతి ఇచ్చామని వ్యాక్సిన్ వందకి 110% ప్రమాదకరం  కాదు అని డీసిజిఐ స్పష్టం చేస్తూ ఉంటే అటు ప్రతిపక్ష పార్టీలు మాత్రం వ్యాక్సిన్ వచ్చినందుకు ఏడుస్తున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా వ్యాక్సిన్ విషయంలో రాజకీయాలు చేయడంపై విశ్లేషకులు మండిపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: