ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాలు ఇవే..!

NAGARJUNA NAKKA
ఆరోగ్య రంగంలో అసమానతలకు తావివ్వకూడదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆదాయం, విద్య, వృత్తి, జాతి, లింగ వివక్షతలకు లాంటి తేడాలు లేకుండా ప్రతీ ఒక్కరికి వైద్య సేవలు సమానంగా అందించేలా దేశాలు పర్యవేక్షణ చేపట్టాలని సూచించింది. అంటు వ్యాధులు కాని రోగాలపై కూడా ధృష్టి పెట్టాలని తెలిపింది. ముఖ్యంగా గుండెపోటు, క్యాన్సర్, డయాబెటీస్ లాంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని కోరింది.
పోలియో, హెచ్ఐవీ, టీబీ, మలేరియా లాంటి వ్యాధులను తరిమికొట్టేందుకు రెండు దశాబ్ధాలుగా డబ్ల్యూహెచ్ ఓ విస్తృతంగా కృషి చేస్తోంది. అయితే 2020లో ఈ పరిశోధనలకు కరోనా ఆటంకం కలిగించింది. 2021లో వీటిపై మళ్లీ ధృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ ఓ భావిస్తోంది.
మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశాలు, సంస్థల మధ్య పరస్పర సహకారం ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అదే స్ఫూర్తితో కలిసి కట్టుగా కరోనాను తరిమికొట్టాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.
కరోనా వైరస్ మూడో రకం ఇపుడు ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. జన్యుమార్పిడి ద్వారా కొత్త రూపం సంతరించుకొని ప్రజలపై దాడులు చేసేస్తోంది. అయితే ఇది గత కరోనా వైరస్ కంటే ఇది చాలా వేగంగా ఉత్పరివర్తనం చెందుతోంది. అంతేకాదు వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయాందోళనకు నెడుతోంది.
అయితే బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చిన వారిని గుర్తించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడి నుంచి వచ్చిన వారిని ఐడెంటిఫై చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాగైనా వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి. తద్వారా కొత్త కరోనాను అరికట్టవచ్చని భావిస్తున్నాయి.
మరోవైపు భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కో వ్యాగ్జిన్ మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. మొదటి, రెండు దశల్లో వెయ్యి మందిపై ప్రయోగాలు జరుపగా సత్ఫలితాలు వచ్చాయి. ఇక మూడో దశ ప్రయోగాల్లో దాదాపు 30వేల మందిపై ప్రయోగాలు జరుపనున్నారు. ఇప్పటికే ఈ వ్యాగ్జిన్ పూర్తి భద్రత ఉండటం, ఇమ్యూనిటీ పవర్ పెంచడంతో దోహదపడుతోంది. ఈ వ్యాగ్జిన్ తీసుకున్న వాళ్లలో యాంటిబాడీలు ఆరు నెలల పాటు ఉంటున్నట్టు వైద్య పరిశోధనల్లో తేలింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: