ఆ నేతలు సమర్థించి ఖండించే కొద్దీ .. ఆ విషయంలో అల్లు అర్జున్ కే నష్టం..?

Amruth kumar
చిత్ర పరిశ్ర‌లో ఉండే సెలబ్రిటీలు రాజకీయ వివాదాలు తెచ్చుకుని వాటి పర్యవసాలాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండరు .. వారి దృష్టి పూర్తిగా వ్యాపారం సినిమాల మీదే ఉంటుంది .. అధికారంలో ఎవరున్నారు అన్నది వారికి ముఖ్యం కాదు .. అధికారంలో ఉన్న వ్యక్తుల ద్వారా తమకు కావాల్సిన పనులు చక చకా చేపించుకోవడం ఒక్కటే వారికి తెలిసిన విద్య. వారికి ఏం చేయాలో అవన్నీ చేస్తారు.. అలాగే ఎంతవరకు తగ్గాలో అంత తగ్గుతారు.. కేవలం సినిమా వ్యాపారం సజావుగా సాగాలని మాత్రమే వారు కోరుకుంటారు.. అలాగే అధికారంలో ఉన్నవారు మాత్రమే అని కాదు రాజకీయంగా ఏ ఒక్క పార్టీతో కూడా వారు వైరం పెంచుకోవడానికి అసలు ఇష్టపడరు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముదురుతున్న వివాదం క్రమంలో ప్రస్తుతం ఆయనకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీ , బిఆర్ఎస్ కు చెందిన అనేకమంది నాయకులు ఆయనకు మద్దతుగా స్పందిస్తున్నారు.. అలాగే అల్లు అర్జున్ వెనకేసుకు వస్తున్నారు ..

ఇప్పుడు ఇవన్నీ కలిసి అల్లు అర్జున్ కాంగ్రెస్‌కు శత్రువుగా మార్చింది . వీరు మద్దతు ఇవ్వగానే వారికి అనిపిస్తుంది గానీ.. వాటికోసం మరో నాలుగేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో వైరం రావడానికి అల్లు కుటుంబం ఇష్టపడుతుందా.. ఇప్పుడు ఇదే జరుగుతుంది.. అల్లు అర్జున్ ను వెనకేసుకొచ్చే అల్లు ఫాన్స్ మొత్తం తమ పార్టీలకు అండగా ఉంటారని అనుకుంటున్నారేమో గానీ .. బిఆర్ఎస్ , బిజెపిలకు చెందిన అగ్ర నాయకులు తమకు సంబంధం లేని వ్యవహారాన్ని తమ భుజాల మీద వేసుకొని ఇందులో వేలు పెడుతున్నారు .. అల్లు అర్జున్ అరెస్టు అయిన దగ్గర్నుంచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రతి పోకుడను తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కూడా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

అలాగే రేవంత్ రెడ్డిని ఇరుకున్న పెట్టడం ఆయనను అవమానించటం.. తెలుగు చిత్ర పరిశ్రమకు రేవంత్ రెడ్డిని శత్రువుగా మారుతున్నారని రంగు పులిమేళా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో ఆయన్ను నెగటివ్ ఇమేజ్ ఏర్పడే ప్రయత్నం చేయటం ఇవన్నీ కూడా వారి వ్యూహాల్లో భాగం కావచ్చు .. కానీ వారు పొగడలు శృతిమించి పోతున్నాయి .. అల్లు అర్జున్ తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా.. ప్రాక్టికల్గా విమర్శలు చేద్దామనే ఆలోచన ఈ రెండు పార్టీల్లో ఎక్కడ కనిపించడం లేదు. ఇలాంటి లాజిక్ లేకుండా అరెస్టును వెనకేసుకు వస్తున్నారు.. దీని కారణంగా అల్లు అర్జున్ పనికొట్టుకుని అన్ని పార్టీల నాయకులతో తమను తిట్టిస్తున్నారని రేవంత్ ప్రభుత్వం భావించే అవకాశం కూడా ఉంది .. దీని కారణంగా అల్లు అర్జున్ పై వారు వైరం పెంచుకుంటారు .. దీనివల్ల ప్రధానంగా అల్లు అర్జున్ కే నష్టం తప్ప .. లాభం కూడా లేదని రాజకీయ విశ్లేషలకు అంచనా వేస్తున్నారు .. మరి అల్లు అర్జున్ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: