బడ్జెట్ రూ. 4కోట్లు.. కానీ ఉపేంద్ర 'UI' సినిమా వసూళ్లు ఎంతో తెలుసా?
మరోవైపు సుదీప్, యష్ వంటి స్టార్స్ కూడా ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన కన్నడ చిత్రం ‘మార్టిన్’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన UI చిత్రం కన్నడ చలన చిత్ర పరిశ్రమకు ఒక కొత్త ఊపిరి ఇచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. భారీ అంచనాల నడుమ ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని, అద్భుతమైన వసూళ్లను రాబడుతోదని సమాచారం.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి 3,45,000 టికెట్స్ అమ్ముడుపోయాయని తెలుస్తోంది. మరోవైపు ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చే సినిమా నుండి ప్రేక్షకులు ఏవైతే ఆశిస్తారో, అంతకు మించే ఈ సినిమాలో ఉండడంతో కలెక్షన్స్ భారీ రేంజ్ లో వస్తున్నాయని సమాచారం. కన్నడ ఇండస్ట్రీ లో ఈ సంవత్సరం ఇంతటి రెస్పాన్స్ ని దక్కించుకున్న సినిమా మరొకటి లేదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా సిటీస్ లో పుష్ప 2 తో సమానంగా హౌస్ ఫుల్స్ నమోదు అవ్వడం గమనార్హం. 3 రోజుల్లో ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. షేర్ ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు తెలుగులో కోటి రూపాయలకు పైగా షేర్ వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకోవాలంటే ఇంకో 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. క్రిస్మస్ వీకెండ్ ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.