కరోనా వైరస్‌లో నెలకు రెండు జన్యు మార్పులు..!

VAMSI
ప్రపంచ దేశాల్లో విలయతాండవం చేసిన కరోనా వైరస్... జనాల జీవితాలను తారుమారు చేసింది. లాక్ డౌన్ సమయంలో ఎప్పుడెప్పుడు బయటకొచ్చి స్వేచ్ఛ గా ఊపిరిపీల్చుకుందామా అని ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడిప్పుడే బయట ప్రపంచంలో ఎప్పటిలాగే సాధారణ జీవితం గడపడానికి ముందుకొస్తున్నారు. అయితే ఇంతలోనే మహమ్మారి కరోనా వైరస్ కు వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందకముందే... మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ అంటూ హెచ్చరికలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

బ్రిటన్‌లో కొత్త రకం కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో వారం రోజుల్లోనే కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యి పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజా వైరస్‌ ముప్పుపై బ్రిటన్‌ నుంచి రాకపోకలను నిషేధిస్తూ పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు ప్రజలు ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా కాస్త ఊరట కలిగించే  విషయాలను వెల్లడించారు.

బ్రిటన్లో వైరస్ లో మార్పులు జరిగిన విషయం నిజమే... కరోనావైరస్ వచ్చినప్పటి నుంచి ఆ వైరస్‌లో నెలకు రెండు జన్యు మార్పులు చోటుచేసుకుంటున్నాయని. కానీ ఈ పరిమాణాలు చూసి అంతగా భయపడాల్సిన అవసరం కానీ దిగులు చెందాల్సిన అవసరం కానీ లేదని తెలిపారు. కానీ ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటిలాగే కరోనా వైరస్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఎప్పటిలాగే అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక కొత్త వైరస్ విషయానికొస్తే... సాధారణంగా వైరస్‌లో జన్యు మార్పులు సహజంగా మార్పుచెందుతూ ఉంటాయి.. వైరస్‌లో ఇది నిరంతరంగా జరిగే ఓ ప్రక్రియ.

ఇలాంటి మార్పులు ఇంతకుముందు ఇతర వైరస్లలో కూడా జరిగాయి అని స్పష్టం చేశారు.. ఇప్పుడు అదే తరహాలో.. కరోనా వైరస్‌లో కొత్త వేరియంట్లు లేదా స్ట్రెయిన్లు వంటి మార్పులు వచ్చాయంటూ తెలిపారు రణదీప్ గులేరియా.. ఇక, వైరస్ జన్యువుల్లో చిన్న చిన్న మార్పులు జరిగినప్పుడు మానవ రోగ నిరోధకశక్తి  ప్రతిస్పందనల్లో పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. కానీ మార్పులు చెందిన ఈ కొత్త వైరస్ కాస్త వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరి కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: